Ustaad Bhagat Singh | మళ్లీ తుపాకీ పట్టిన పవన్ కల్యాణ్
Ustaad Bhagat Singh - ఉస్తాద్ భగత్ సింగ్ రెండో షెడ్యూల్ స్టార్ట్ చేశాడు పవన్ కల్యాణ్. పవన్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న క్రేజీ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హీరో ఉపయోగించే ఆయుధాలన్నింటినీ రివీల్ చేస్తూ ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ పోస్టర్‌ను షేర్ చేశాడు.
తాజాగా ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. పవన్ కళ్యాణ్ షూట్‌లో జాయిన్ అయ్యాడు. కొత్త షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్ షేడ్స్‌తో కనిపిస్తున్నాడు. అతడి చేతిలో తుపాకీ ఉంది.
ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి పెద్ద సెట్ రూపొందించాడు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్‌ను మెప్పించే సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో పోలీస్ ఆఫీసర్‌గా ప్రెజెంట్ చేస్తున్నాడు.
సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.