Pawan Kalyan: పవన్ ఖాతాలో మరో దర్శకుడు
Pawan Kalyan: ఆల్రెడీ పవన్ లిస్టులో చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో డైరెక్టర్ వచ్చి చేరాడు

Jana Sena Party (JSP) President Pawan Kalyan
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించి త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు ఈ హీరో. ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత, హరీష్ శంకర్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడు పవన్. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే, హరీష్ తో పాటు సుజీత్ కు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
సాహో తర్వాత సుజీత్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈమధ్యే పవన్ కళ్యాణ్ ను కలిసి ఓ స్టోరీ వినిపించాడు. త్రివిక్రమ్ రిఫరెన్స్ తో పవన్ కల్యాణ్ ను కలిసి తన స్టోరీలైన్ తో పవన్ ను మెస్మరైజ్ చేశాడట ఈ యంగ్ డైరక్టర్. దీంతో వెంటనే పవన్ కాల్షీట్లు ఇచ్చినట్టు టాక్. డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ లో నెలలో హరీశ్ శంకర్, సుజీత్ సినిమాలు లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, ఏపీలో 2024లో జరగబోయే ఎన్నికలపై పవన్ గట్టిగా ఫోకస్ పెట్టారు. మెల్లగా సినిమా షూటింగ్స్ తగ్గించి, రాజకీయాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నారు. సో.. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చాలా ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి.