Telugu Global
Cinema & Entertainment

జూలైలో కెమెరా ముందుకు ప‌వ‌న్‌.. హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ మూడు సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది.

జూలైలో కెమెరా ముందుకు ప‌వ‌న్‌.. హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే?
X

జ‌న‌సేన అధినేత‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలకు సంబంధించి సమీక్షలు జరుపుతూ పాలిటిక్స్ లో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఇకపోతే మరోవైపు పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ మూడు సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది.

వీటిల్లో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న‌ హరిహర వీరమల్లు చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ క్రిష్‌ డైరెక్షన్ లో 70 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన ముప్పై శాతాన్ని ఎ.ఎం.రత్నం త‌నయుడు జ్యోతికృష్ణ పూర్తి చేయనున్నారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం.రత్నం ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ.. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ కి సంబంధించి మేజర్ పార్ట్ కంప్లీట్ అయింది. మరో 20 నుంచి 25 రోజుల సమయం కేటాయిస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పవన్ కు ఉన్న బిజీ షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ ప్రణాళికలను రెడీ చేస్తున్నాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. మచిలీపట్నం ఓడరేవు సన్నివేశాలకు ఇరాక్‌కి చెందిన ప్రముఖ కంపెనీతో బెంగ‌ళూరులో సీజీ వర్క్‌ చేయిస్తున్నాం. ఇందులో కుస్తీ పోటీల ఎపిసోడ్ హైలెట్‌గా ఉంటుంది.

అలాగే చార్మినార్‌ ఎపిసోడ్ మ‌రియు పులితో పవన్ కళ్యాణ్‌ పోరాట సన్నివేశానికి హైద‌రాబాద్ లో సీజీ వర్క్ జ‌రుగుతుంది. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబర్ లో సినిమా విడుదల కావాలి. కానీ షూటింగ్ లో జరిగిన జాప్యం కారణంగా ఇంకొంత సమయం పడుతుంది. అయితే ఎట్టి పరిస్థితిలోనూ డిసెంబర్ చివర నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. కాగా, జూలై చివ‌రి వారం లేదా ఆగ‌స్టు నెల‌లో ప‌వ‌న్ కెమెరా ముందుకు రాబోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బ‌లంగా టాక్ న‌డుస్తోంది. పవన్‌ షూటింగులు మొదలు పెడితే మొద‌ట హ‌రిహ‌ర విర‌మ‌ల్లునే పూర్తి చేస్తాడ‌ని అంటున్నారు.

First Published:  30 Jun 2024 11:23 AM IST
Next Story