Pawan Kalyan | పవన్ పై రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి
Pawan Kalyan - ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పవన్ పై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది.

Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ సినిమా ఆగలేదంట
పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం క్రిష్ తో హరి హర వీర మల్లు, సుజీత్ తో ఓజీ, హరీష్ శంకర్ తో ఉస్తాద్ గబ్బర్ సింగ్ అనే 3 సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే పవన్ ఇటు రాజకీయాలతో కూడా బిజీగా ఉండడం వల్ల రీషెడ్యూల్స్ కారణంగా, ఈ 3 సినిమాల షూటింగ్స్ దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు నిర్మాతలు ముగ్గురూ తమ చిత్రాలను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నారు.
సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు ఓజీ మేకర్స్, అందుకే నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ని డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు, అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కూడా అడుగుతోంది. ఎందుకంటే, వీళ్లు ఫుల్ ఎమౌంట్ ఇచ్చారంట.
ఇక హరి హర వీర మల్లు సంగతి సరేసరి. ఏళ్లుగా ఈ షూటింగ్ నడుస్తూనే ఉంది. ఎప్పుడు అడిగినా పవన్ డేట్స్ ఇవ్వడం లేదు. ఈసారి మాత్రం గట్టిగా కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత ఏఎం రత్నం. మరోవైపు క్రిష్ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఇక ఎక్కువ రోజులు ఈ ప్రాజెక్టుపై ఉండలేనని క్రిష్ కూడా తేల్చిచెప్పినట్టు తెలుస్దోంది.
సో.. ప్రస్తుతానికి నిర్మాతలంతా పవన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. పవన్ మాత్రం వరుణ్ తేజ్ పుట్టినరోజు కోసం ఇటలీ వెళ్లాడు. ఇండియా తిరిగొచ్చిన తర్వాత అతడు ఏ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తాడో చూడాలి.