Pawan Kalyan: విమానంలో పవన్ కల్యాణ్ కు అవమానం
Pawan Kalyan facing Racism in flight: పవన్ కల్యాణ్ కూడా జాత్యహంకానికి గురయ్యాడు. ఈ విషయాన్ని అతడే బయటపెట్టాడు.
భారతీయులకు విదేశాల్లో వివక్ష కొత్తకాదు. ఈ విషయంలో షారూక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం వివక్షకు గురయ్యారు. ఇప్పుడీ లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ కూడా చేరాడు. ఓసారి విదేశాలకు వెళ్తున్నప్పుడు విమానంలో తను జాత్యహంకారానికి గురైనట్టు బయటపెట్టారు పవన్.
"ఓసారి విదేశాలకు విమానంలో వెళ్తున్నప్పుడు నేను కూడా జాత్యహంకారానికి గురయ్యాను. నా తోలు తెల్లగా లేదు కాబట్టి ఏదో ఒక సందర్భంలో నేను వివక్షకు గురవుతానని నాకు తెలుసు. ఆ రోజు విమానంలో నాకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఓ బ్రిటిష్ ఎయిర్ హోస్టెస్ సంకోచించింది. నేను బిజినెస్ క్లాస్ లో ఉన్నాను, నీళ్లు అడుగుతుంటే, నా మాట వింటోంది కానీ ఇవ్వడం లేదు. చాలాసేపు భరించాను."
అదే ఫ్లయిట్ లో తను నిరసనకు దిగానని తెలిపారు పవన్. ఎయిర్ హోస్టెస్ వచ్చి క్షమాపణలు చెప్పినంత వరకు సీటు నుంచి కదల్లేదన్నారు.
"నా నిరసనను గట్టిగా తెలియజేశాను. గమ్యస్థానం వచ్చిన తర్వాత కూడా నేను ఫ్లయిట్ దిగలేదు. అందరూ దిగినా నేను అలానే కూర్చున్నాను. పైలట్ ను రమ్మన్నాను. అతడిపై నా కోపం చూపించాను. మాకు సేవలందించడానికి ఇష్టంలేకపోతే విమాన సర్వీసులు నిలిపేయమని చెప్పాను. ఇలా డబ్బులు తీసుకొని మరీ వివక్ష చూపిస్తే మాత్రం సహించేది లేదని గట్టిగా చెప్పాను. దెబ్బకు ఆ ఎయిర్ హోస్టెస్ అయిష్టంగానే నాకు సారీ చెప్పింది."
ఇలా తనకు ఎదురైన రేసిజం గురించి బయటపెట్టారు పవన్ కల్యాణ్. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, భారతీయుడు ఏదో ఒక మూల వివక్షకు గురవుతున్నాడన్నారు పవన్.