Pawan Kalyan | పదేళ్ల నిరీక్షణకు తెర
Pawan Kalyan becomes MLA - పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు.

పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. పార్టీ పెట్టిన దశాబ్దం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు పవన్ కల్యాణ్. పిఠాపురం ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ పదేళ్లలో పవన్ సాధించిన తొలి రాజకీయ విజయం ఇది.
2014లో ఆర్భాటంగా పార్టీ పెట్టారు పవన్. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన అప్పటి ఎన్నికల్లో ఆయన పాల్గొనలేదు. కేవలం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి, ప్రచారం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుతో విభేదించి సొంతంగా పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
ఎప్పుడైతే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారో, అప్పట్నుంచి క్రమక్రమంగా టీడీపీ గూటికి చేరుతూ వచ్చారు పవన్. ఎప్పుడైతే చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ లో అరెస్టయ్యారో, అప్పుడే టీడీపీతో అలయెన్స్ ప్రకటించారు.
అలా పొత్తులో భాగంగా ఏపీలో 21 స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ, బరిలో దిగిన ప్రతి చోటా గెలిచింది. అలా తొలిసారి ఏపీ అసెంబ్లీలో పవన్ అడుగుపెట్టబోతున్నారు.