పవన్ జీ.. నేనూ మూడు రోజులు దీక్ష చేస్తున్న
కార్తీ వ్యాఖ్యలపై ఆయన అన్న సూర్య విచారం

తిరుమల లడ్డూ వివాదంపై తమిళ యంగ్ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఆయన అన్న, హీరో సూర్య స్పందించారు. ఇటీవల ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కార్తీ చేసిన వ్యాఖ్యలపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని సూర్య 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. కార్తీ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కోరారు. కార్తీ చేసిన వ్యాఖ్యలకు పరిహారంగా తాను మూడు రోజుల పాటు దీక్ష చేయబోతున్నానని తెలిపారు. తన ట్వీట్ ను పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేశారు. మంగళవారం ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకాశ్ రాజ్ సహా ఇతర నటులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సెక్యులరిజం ముసుగులో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే కార్తీ 'ఎక్స్' వేదికగా స్పందించి తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ఆయన అన్న, హీరో సూర్య తాను మూడు రోజుల దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. తన ట్వీట్ ను ఆయన సరిగా అర్థం చేసుకోలేదని, ఇండియాకు తిరిగి రాగానే తాను చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.