Telugu Global
Cinema & Entertainment

Pavitra Lokesh - మహేష్ బాబు కుటుంబం నన్ను అంగీకరించింది

Pavitra Lokesh Mahesh Family - మహేష్ బాబు కుటుంబం తనను అంగీకరించిందని ప్రకటించారు పవిత్ర లోకేష్. నరేష్ తో తనకున్న బంధాన్ని ఆమె బయటపెట్టారు.

Pavitra Lokesh - మహేష్ బాబు కుటుంబం నన్ను అంగీకరించింది
X

నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమించుకుంటున్నారు. కలిసి ఉంటున్నారు కూడా. మరి వీళ్ల సహజీవనానికి కృష్ణ కుటుంబం ఒప్పుకుందా? మరీ ముఖ్యంగా కృష్ణ, విజయనిర్మల దీనికి అంగీకరించారా? మరి మహేష్ బాబు సంగతేంటి? నరేష్ సహజీవనాన్ని మహేష్ బాబు ఒప్పుకున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ పవిత్ర లోకేష్ సమాధానం ఇచ్చారు.

"విజయ నిర్మల గారిని నేను కలిశాను. కానీ మేము కలిసినప్పుడు విజయ నిర్మల గారి ఆరోగ్యం అంతగా బాలేదు. ఆమెతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రాలేదు. కానీ కృష్ణ గారితో చాలా సమయం గడిపాం. ఆయనతో మాట్లాడటం, ఎన్నో విషయాలని పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో అదృష్టంగా భావిస్తున్నాను. మహేష్ బాబు గారిని కూడా కలిశాను. మహేష్ ఫ్యామిలీ మమ్మల్ని యాక్సప్ట్ చేసింది."

ఇలా తమిద్దరి బంధాన్ని మహేష్, కృష్ణ, విజయనిర్మల ఆమోదించారనే విషయాన్ని పవిత్ర లోకేష్ బయటపెట్టారు. ఇటు నరేష్, అటు పవిత్ర ఇద్దరూ తమ మాజీ భాగస్వాముల నుంచి అధికారికంగా విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. విడాకులు మంజూరైన తర్వాత.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు.

ఈ గ్యాప్ లో నరేష్-పవిత్ర కలిసి సినిమా చేశారు. ఈ సినిమా పేరు మళ్లీ పెళ్లి. నరేష్-పవిత్రల నిజజీవిత ఘటనలతో ఈ సినిమా తెరకెక్కింది. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమాతో రియల్ ఎంత, కల్పితం ఎంతనేది చూసి తెలుసుకోవాలంటున్నారు పవిత్ర.

First Published:  24 May 2023 11:14 AM IST
Next Story