Pavitra Lokesh - కొన్నిసార్లు సీక్రెట్స్ బయటకు చెప్పాల్సిందే
Pavitra Lokesh real-life secrets - కొన్నిసార్లు నిజజీవిత రహస్యాల్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు పవిత్ర లోకేష్.

నిజజీవితంలో నరేష్-పవిత్ర ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. తమ మనసులు కలిశాయి కాబట్టి, పెళ్లయినపోయినట్టేనని నరేష్ ఇదివరకే ప్రకటించారు. ఇద్దరం సహజీవితం చేస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. వీళ్ల జీవితాలకు చెందిన యదార్థ ఘటనలతో మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా తెరకెక్కింది.
సీక్రెట్ గా సాగాల్సిన ఈ వ్యవహారంపై ఏకంగా సినిమానే తీసి తమ ధైర్యాన్ని చాటిచెప్పింది ఈ జంట. అయితే కొన్నిసార్లు రహస్యాల్ని కూడా బయటకు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుందని, మళ్లీ పెళ్లి సినిమా అలాంటిదేనని వెల్లడించింది పవిత్ర.
"జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ ని ఎవరూ బయటికి చెప్పరు. కానీ కొన్ని సార్లు సీక్రెట్లు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది సమాజంలో చాలా ఇళ్లల్లో జరుగుతున్న కథగా ప్రేక్షకులకు అనిపిస్తే, మేము గెలిచినట్లే. మళ్ళీ పెళ్లి చిత్రాన్ని విమర్శనాత్మకంగా సపోర్ట్ చేస్తున్నారు. యంఎస్ రాజు చాలా అందమైన చిత్రం తీశారు. ఆయన అనుభవం అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి చిత్రం నరేష్ వలనే సాధ్యమైంది. ఇందులో నా పాత్ర ద్వారా మహిళలు వారి హక్కుల కోసం నిలబడితే అంతకంటే నాకు ఆనందం ఉండదు.’’
ఇలా తన జీవితంలో జరిగిన ఘటనలు, సీక్రెట్స్ తోనే మళ్లీ పెళ్లి సినిమా తీశామనే విషయాన్ని పవిత్ర బయటపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. అయితే స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.