Parineeti Chopra - త్వరలోనే పరిణీతి చోప్రా పెళ్లి
Parineeti Chopra - పరిణీతి చోప్రా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతోంది. రాజకీయ నేత రాఘవ్ చద్దాతో ఆమె సన్నిహితంగా ఉంటోంది.
బాలీవుడ్ లో మరో బ్యూటీ పెళ్లికి సిద్ధమౌతోంది. ఇప్పటికే శ్రియ, అలియాభట్, కియరా అద్వానీ లాంటి ఎంతోమంది తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి పరిణీతి చోప్రా కూడా చేరబోతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాదిలోనే పరిణీతి చోప్రా పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయి. కొన్నాళ్లుగా ఆమె రాజకీయవేత్త, ఆప్ నాయకుడు రాఘవ్ చద్దాతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వాళ్లు దాచిపెట్టలేదు. కెమెరాలకు పోజులిచ్చి మరీ నిర్థారించారు.
ఇప్పుడీ ఇద్దరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. వచ్చేనెలలో వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ ఉంటుందంటూ బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి. ఆ వెంటనే 2 నెలల గ్యాప్ లో పెళ్లి ఉండే అవకాశం ఉందంట.
లండన్ లో చదువుకునే రోజుల్లో రాఘవ్-పరిణీతి క్లాస్ మేట్స్. ఆ తర్వాత ఎవరి రంగాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. మళ్లీ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఈమధ్య కలుసుకున్నారు. అప్పట్నుంచి ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారట. పెళ్లి కోసం ఈమధ్య వీళ్లిద్దరూ లండన్ వెళ్లి షాపింగ్ కూడా పూర్తిచేసినట్టు తెలుస్తోంది