Telugu Global
Cinema & Entertainment

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. ఇక చాలు ప్రకాశ్‌రాజ్ ట్వీట్

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి అని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ట్వీట్ చేశారు

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. ఇక చాలు ప్రకాశ్‌రాజ్ ట్వీట్
X

టీటీడీ లడ్డూ నాణ్యతాపై మరోసారి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ట్వీట్ చేశారు. "కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ..కదా!... ఇక చాలు.. ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి.." అంటూ పేర్కొన్నారు. తన ట్రేడ్ మార్క్ హ్యాష్ ట్యాగ్ 'జస్ట్ ఆస్కింగ్' ను కూడా జోడించారు. తిరుమల లడ్డూ కల్తీపై ప్రకాశ్‌రాజ్ ఎక్స్ ఖాతాల్లో తరచుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన కొన్ని ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాకింగ్ తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే.. సిట్ దర్యాప్తు నిలిపివేశారు.

దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ‍ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వెంటనే నటుడు ప్రకాశ్‌ రాజ్‌ రియాక్ట్‌ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అంటూ పోస్ట్‌ చేశారు.

First Published:  1 Oct 2024 3:30 PM IST
Next Story