Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్ : 5 న అమెజాన్ లో హాయ్ నాన్నా!

కొత్త సంవత్సరం మొదటి వారాన్ని వినోదాత్మకంగా ప్రారంభించేందుకు ఓటీటీల్లో కొత్త సినిమాలు, షోలు, సిరీసులు, డాక్యుమెంటరీలు, యానిమేషన్లు వరుస కట్టాయి. వీటిలో ప్రధానంగా నాని -మృణాల్ ఠాకూర్ నటించిన సరికొత్త తెలుగు చలన చిత్రం ‘హాయ్ నాన్నా’, కంగనా రణవత్ నటించిన హిందీ ‘తేజస్’, తమిళ హర్రర్ కామెడీ ‘కంజ్యూరింగ్ వీరప్పన్’ వున్నాయి.

ఓటీటీ వాచ్ లిస్ట్ : 5 న అమెజాన్ లో హాయ్ నాన్నా!
X

కొత్త సంవత్సరం మొదటి వారాన్ని వినోదాత్మకంగా ప్రారంభించేందుకు ఓటీటీల్లో కొత్త సినిమాలు, షోలు, సిరీసులు, డాక్యుమెంటరీలు, యానిమేషన్లు వరుస కట్టాయి. వీటిలో ప్రధానంగా నాని -మృణాల్ ఠాకూర్ నటించిన సరికొత్త తెలుగు చలన చిత్రం ‘హాయ్ నాన్నా’, కంగనా రణవత్ నటించిన హిందీ ‘తేజస్’, తమిళ హర్రర్ కామెడీ ‘కంజ్యూరింగ్ వీరప్పన్’ వున్నాయి. 2023 లాగానే 2024లో కూడా మీకు వినోదాన్ని, ఉల్లాసాన్ని పంచి పెడుతుంది ఓటీటీ కంటెంట్. ఈ వారం ఏమేమున్నాయో వాచ్ లిస్ట్ లో ఓ లుక్కేద్దాం!

నెట్‌ఫ్లిక్స్ లో 9

1. ఫూల్ మీ ఒన్స్ (ఇంగ్లీషు సిరీస్ ) -జనవరి 1

కథేమిటి : మాజీ సైనికురాలు మాయ హత్యకి గురైన భర్తని రహస్య నానీ క్యామ్‌లో చూసినప్పుడు, గతంలోకి లోతుగా ప్రయాణించి ఘోరమైన కుట్రని వెలికితీస్తుంది.

2. యూ విల్ ఈట్ వాట్ యూ ఈట్ : ఏ ట్విన్ ఎక్స్ పెరిమెంట్ (నెట్ ఫ్లిక్స్ షో)- జనవరి1

ఒకేలాంటి కవలలు ఎనిమిది వారాల పాటు తమ ఆహారపుటలవాట్లని, జీవనశైలిని మార్చుకునేలా -ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ ప్రయోగంలో కొన్ని ఆహారాలు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అన్వేషిస్తుంది ఈ కథ.

3. బిట్‌కాన్డ్ (నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ)- జనవరి 1

కథేమిటి : ఈ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ భయంకరమైన బిట్‌కాయిన్ మోసం వెనుక సూత్రధారి అయిన రే ట్రాపా ప్రయాణాన్ని తెలుపుతుంది.

4. డెలీషియస్ ఇన్ డంజన్ (జపనీష్ యానిమేషన్) –జనవరి 4

5. సొసైటీ ఆఫ్ ది స్నో (స్పానిష్ మూవీ)- జనవరి 4

కథేమిటి : ఈ సర్వైవలిస్ట్ కథా చిత్రం 1972 లో ఉరుగ్వే లో ఆండీస్ ప్రమాద విపత్తు నుంచి బయటపడిన వారి అనుభవాల చుట్టూ తిరుగుతుంది.

6. బ్రదర్స్ సన్ (అమెరికన్ షో)- జనవరి 4

7. కంజ్యూరింగ్ కన్నప్పన్‌ (తమిళ మూవీ) -జనవరి 5

కథేమిటి: ఈ తమిళ హార్రర్ కామెడీ లో కథ నిద్రలో పీడకలలు కనడం ప్రారంభించిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అది నిజ జీవితంలో అతడిపై ప్రభావం చూపుతుంది. కానీ అతడి మానసిక రుగ్మత కుటుంబానికి, స్నేహితులకీ వ్యాపించడంతో, దీని వెనకున్నమూలాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంటారు.

8. గుడ్ గ్రీవ్ (ఇంగ్లీషు మూవీ)- జనవరి 5

కథేమిటి : మార్క్ (డాన్ లెవీ) తన భర్త (?) ఆలివర్ (ల్యూక్ ఎవాన్స్) నీడలో జీవించాడు. కానీ ఆలివర్ ఊహించని విధంగా మరణించినప్పుడు, తన ప్రపంచం ఛిన్నాభిన్నమవుతుంది. బాధ మరిచిపోవడానికి ఇద్దరు ప్రాణ స్నేహితులతో పారిస్ యాత్ర కెళ్తాడు. అక్కడ ముగ్గురూ కొన్ని కఠిన సత్యాల్ని తెలుసుకుంటారు.

9. జియోంగ్‌సోంగ్ క్రియేచర్ (కొరియన్ షో) -జనవరి 5

అమెజాన్ ప్రైమ్ లో 4

1. మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ మూవీ ) - జనవరి 1

2. జేమ్స్ మే - అవర్ మ్యాన్ ఇన్ ఇండియా (అమెరికన్ సిరీస్) -జనవరి 5

3. LOL లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబెక్ (ఫ్రెంచ్ షో)- జనవరి 5

4. ఫో (ఇంగ్లీషు మూవీ)- జనవరి 5

డిస్నీ+ హాట్‌స్టార్ లో 2

1. ఇషురా (జపనీస్ షో)- జనవరి 3

2. పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ (మలయాళం మూవీ)- జనవరి 5

కథేమిటి : ప్రియుడు శ్రీకుట్టన్‌తో ప్రేమ కోసం పెరిల్లూరు గ్రామానికి వచ్చిన మాళవిక, అనూహ్యంగా తన ఇష్టానికి విరుద్ధంగా గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు అవు

తుంది. తర్వాత, పెరిల్లూరు పంచాయతీలోని దారితప్పిన ప్రజల వల్ల కలిగే సమస్యలతో పాటు ఆమె జీవితం తలకిందులవుతుంది.

క్యూచెక్ లో 1

1. ఎల్ ఓ ఎల్- లాస్ట్ వన్ లాఫింగ్ (ఎమెరికన్ షో)-జనవరి 5

రకుటెన్ వీకీ లో 1

1. లవ్ సాంగ్ ఫర్ ఇల్ల్యూషన్ (కొరియన్ మూవీ)- జనవరి 2

జియో సినిమాలో 1

1. మెగ్ 2- ది ట్రెంచ్ (ఇంగ్లీషు మూవీ)- జనవరి 3

జీ5 లో 1

1. తేజస్ (హిందీ మూవీ )-జనవరి 5

కథేమిటి : చాలా రహస్య సమాచారాన్ని కలిగి వున్న భారతీయ గూఢచారిని రక్షించే పనిలో వున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ తేజస్ గిల్ (కంగనా రణవత్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అలా చేస్తున్నప్పుడు ఆమె తన విషాదకరమైన గత జ్ఞాపకాలతో సంఘర్షణకి లోనవుతుంది.

సోనీ లివ్ లో 1

క్యూబికల్ సీజన్ 3 (హిందీ సిరీస్ )- జనవరి 5

First Published:  1 Jan 2024 6:01 PM IST
Next Story