Telugu Global
Cinema & Entertainment

కొత్త ఓటీటీ వాచ్ లిస్ట్- హనుమాన్, లాల్ సలాం, మెర్రీ క్రిస్మస్!

ఈ వారం ఓటీటీల్లో ‘షోటైమ్’ , ‘ది రెజీమ్’, ‘మహారాణి 3’, ‘సూపర్‌సెక్స్’, ‘డామ్సెల్’, ‘క్వీన్ ఆఫ్ టియర్స్’ ... ఇంకా మరెన్నో కొత్త హిందీ, ఇంగ్లీషు టైటిల్స్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి.

కొత్త ఓటీటీ వాచ్ లిస్ట్- హనుమాన్, లాల్ సలాం, మెర్రీ క్రిస్మస్!
X

ఈ వారం ఓటీటీల్లో ‘షోటైమ్’ , ‘ది రెజీమ్’, ‘మహారాణి 3’, ‘సూపర్‌సెక్స్’, ‘డామ్సెల్’, ‘క్వీన్ ఆఫ్ టియర్స్’ ... ఇంకా మరెన్నో కొత్త హిందీ, ఇంగ్లీషు టైటిల్స్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. అదనంగా, ఈ లిస్ట్ లో తాజా సినిమాలు రజనీకాంత్ నటించిన ‘లాల్ సలాం’, విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ నటించిన ‘మెర్రీ క్రిస్మస్’, తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ కూడా చేరాయి. ఈ వారం థియేటర్స్ లో గోపీ చంద్ ‘భీమా’, విశ్వక్ సేన్ ‘గామి’, మలయాళం హిట్ తెలుగు డబ్బింగ్ ‘ప్రేమలు’, ఇంకా ‘రికార్డ్ బ్రేక్’ అనే చిన్న సినిమా విడుదలవుతున్నాయి. వీటిలో ఏవేవి చూడాలనుకుంటారో మీ ఇష్టం.

ఇక ఓటీటీ రంగంలో చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలపై దృష్టి పెడితే- వాల్ట్ డిస్నీ ఇండియా - రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన వయాకామ్ ల విలీనం వినోద రంగంపై పెద్ద ప్రభావమే చూపే అవకాశముంది. ప్రస్తుతం చందాదారులు పొందుతున్న చవక సబ్ స్క్రిప్షన్ల ఆఫర్లు క్రమంగా ముగిసే అవకాశముంది. అంటే టారిఫ్ లు పెరగవచ్చు. ఏ మేరకు అన్నది ప్రకటిస్తారు. ఈ విలీనంతో స్టార్ ఇండియాకి చెందిన 70కి పైగా ఛానెల్‌లు, వయా కామ్ కి చెందిన 38 టీవీ ఛానెల్‌లు ఒకటవుతాయి. వీటితోపాటు రెండు పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు జియో సినిమా - హాట్‌స్టార్ లతో బాటు, ఈ రెండిటికి చెందిన రెండు రెండు ఫిల్మ్ స్టూడియోలూ ఒకటవుతాయి. కంటెంట్ ఈజ్ కింగ్ స్లోగాన్ తో రిలయన్స్-హాట్ స్టార్ దేశంలో అతి పెద్ద ఓటీటీ వేదికని సృష్టించి ఇతర వేదికల్ని అతలాకుతలం చేసే అవకాశముంది. ఈ గుత్తాధిపత్యంతో ప్రేక్షకులు ఇతర వేదికల్ని కోల్పోవడం జరిగితే అది దురదృష్టమే కాగలదు. ఈ కింద తాజా వాచ్ లిస్ట్ పై లుక్కేయండి...

తెలుగు సినిమాలు 3

1. హనుమాన్- జీ 5- మార్చి 8

2. లాల్ సలాం-నెట్ ఫ్లిక్స్- మార్చి8

3. మెర్రీ క్రిస్మస్-నెట్ ఫ్లిక్స్- మార్చి 9

జియో సినిమాలో 1

1. ది రేజీమ్ (కేట్ విన్ స్లెట్ నటించిన లిమిటెడ్ సిరీస్)-మార్చి 5

నెట్‌ఫ్లిక్స్ లో 11

1. హాట్ వీల్స్ లెట్స్ రేస్- మార్చి 4

2. హన్నా గాడెస్ బీస్ జెండర్ అజెండా (కామెడీ షో)- మార్చి 5

3. ఫుల్ స్వింగ్ (సీజన్ 2)- మార్చి 6

4. ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్ (డాక్యు సిరీస్)- మార్చి 6

5. సూపర్ సెక్స్ (పోర్న్ స్టార్ బయోపిక్)- మార్చి 6

6. ది జెంటిల్‌మెన్‌ (థ్రిల్లర్ సిరీస్)- మార్చి 7

7. పోకెమాన్ హొరైజన్స్‌ (యానిమేషన్ సిరీస్)- మార్చి 7

8. ది సిగ్నల్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 7

9. బ్లోన్ అవే -సీజన్ 4 (సిరీస్)- మార్చి 8

10. డామ్‌ సెల్‌ (ఇంగ్లీష్ ఫాంటసీ మూవీ)- మార్చి 8

11. ది క్వీన్ ఆఫ్ టియర్స్ (సిరీస్)- మార్చి 9

అమెజాన్ ప్రైమ్ లో 2

1. బ్యాచిలర్ పార్టీ ( ఇంగ్లీష్ షో)- మార్చి 4

2. రికీ స్టానికీ (ఇంగ్లీష్ కామెడీ మూవీ)- మార్చి 6

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 2

1.ఎక్స్ ట్రార్డినరీ సీజన్ 2 (సిరీస్)- మార్చి 7

2. షో టైమ్ (హిందీ స్టార్ సిరీస్)- మార్చి 8

హోయి చోయి లో 1

1. బొగ్లా మామా (బెంగాలీ కామెడీ డ్రామా)- మార్చి7

ఆపిల్ టీవీ ప్లస్ లో 1

1. ది రిలక్టంట్ ట్రావెలర్ సీజన్ 2 సిరీస్ మార్చి 5

సోనీ లీవ్ లో 1

1. మహారాణి 3 (హిందీ సిరీస్)- మార్చి 8

First Published:  5 March 2024 12:36 PM IST
Next Story