Telugu Global
Cinema & Entertainment

ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్

తాజా ఓటీటీ విడుదలల వారంవారీ అప్‌డేట్ ఈ వారం పుష్కలంగా 24 సినిమాలతో, షోలతో సిద్ధమైంది.

ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్
X

తాజా ఓటీటీ విడుదలల వారంవారీ అప్‌డేట్ ఈ వారం పుష్కలంగా 24 సినిమాలతో, షోలతో సిద్ధమైంది. అయితే తెలుగులో మాత్రం ఏవీ లేకపోవడం లోటు. మే 28 నుంచి జూన్ 2 వరకూ ఇతర భాషల్లో స్ట్రీమింగ్స్ తో సరిపెట్టుకోక తప్పదు. హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ మూడవ సీజన్‌ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే రణదీప్ హుడా దర్శకత్వంలో ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ మూవీ డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది. అమెరికన్ యాక్షన్ అడ్వెంచర్ టీవీ సిరీస్ సీక్వెల్ ‘డై హార్ట్ 2: డై హార్టర్‌’ కూడా ఇప్పుడే చూడొచ్చు. ఇకా జపనీస్, స్పానిష్ స్ట్రీమింగ్స్ కూడా ఈ మండే ఎండల్లో కూల్ గా ఎంజాయ్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ కింద స్క్రోల్ చేయండి.

1. పంచాయత్ సీజన్ 3 (మే 28) - అమెజాన్ ప్రైమ్ వీడియో

గ్రామ పంచాయితీ కార్యదర్శి పాత్ర అభిషేక్ త్రిపాఠీ కథ కొనసాగిస్తూ మూడవ సీజన్ ప్రారంభమవుతుంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రత్యర్ధులిద్దరూ తమ ప్రతిష్ట పెంచుకోవడానికి తీవ్రంగా పోరాడుతున్న సమయంలో రాజకీయ డ్రామా వేడెక్కుతుంది. పంచాయితీ కార్యదర్శిగా అభిషేక్ త్రిపాఠీ నిష్పాక్షికతని కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఆ రాజకీయ క్రీడలో ఆట నేర్చుకుంటాడు. బాలీవుడ్ నటులు నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ సైతం ఇందులో నటించారు.

2. స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (మే 28) -జీ5

ఈ హిందీ మూవీలో స్వాతంత్ర్య ఉద్యమంలో వినాయక్ దామోదర్ సావర్కర్‌గా రణ్‌దీప్ హుడా నటిస్తూ దర్శకత్వం వహించాడు. సావర్కర్ లండన్‌లో న్యాయవిద్యాభ్యాసం పూర్తి చేయడం నుంచీ బ్రిటీష్ పాలనకి వ్యతిరేకంగా అతడి విప్లవాత్మక కార్యకలాపాల వరకూ చేసిన ప్రయాణాన్ని ఈ కథ వివరిస్తుంది. అతడి హిందూత్వ భావజాలాన్ని, స్వాతంత్య్రానంతర అవిభక్త భారత్ పట్ల అతను అనుసరించిన విధానాల్నీ పరిశీలిస్తుంది. ఇందులో సావర్కర్ మిలిటెంట్ కోణానికి మహాత్మా గాంధీ అహింసాత్మక ప్రతిఘటన వుంటుంది. అతడ్ని బ్రిటిష్ పాలకులు భారత్ లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రకటించడాన్ని ఈ మూవీ చూపిస్తుంది.


3. బయోనిక్ (మే 29) -నెట్ ఫ్లిక్స్

ఈ మూవీ 2035 సంవత్సరంలో అధునాతన బయోనిక్ ప్రోస్తేటిక్స్ (కృత్రిమ అవయువ మార్పిడి) ద్వారా సమాజంపై ఆధిపత్యం చెలాయించే డిస్టోపియన్ భవిష్యత్తుని వర్ణిస్తుంది . ఈ నేపథ్యంలో లాంగ్-జంప్ లో ప్రత్యర్ధులైన అక్కా చెల్లెళ్ళు మరియా, సోఫియాల సంక్లిష్ట జీవన యానాన్ని ఈ కథ చూపిస్తుంది. ఈ ఇద్దరూ సాంకేతికంగా భారీ మార్పులు జరిగిన ప్రపంచాన్ని నావిగేట్ చేస్తున్నప్పుడు నేరంలో, హింసలో వాళ్ళ ప్రమేయం పెరుగుతుంది. ఆశయం, శత్రుత్వం, సాంకేతిక పురోగతుల పట్ల నైతిక చిక్కుల ఇతివృత్తాల్ని ఇది పరిశీలిస్తుంది.

4. ఇల్లీగల్ - సీజన్ 3 (మే 29) -జియో సినిమా

పేరు పొందిన ‘లా కంపెనీ’ నైతికంగా సంక్లిష్టంగా వున్న ప్రపంచంలో చేసే న్యాయ పోరాటాన్ని ఈ హిందీ సిరీస్ లో చూడొచ్చు. ఇందులో నిహారికా సింగ్‌గా నేహా శర్మ, అక్షయ్ జైట్లీగా అక్షయ్ ఒబెరాయ్, జనార్దన్ జైట్లీగా పియూష్ మిశ్రా నటించారు.

5. డై హార్ట్ 2: డై హార్టర్ (మే 30) -అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ సీక్వెల్‌లో కెవిన్ హార్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్ గా నటిస్తాడు. ఒక దుష్ట ప్రతీకార కుట్రకి తను బాధితుడ్నయ్యానని గుర్తించి, ఇందులోచి బయట పడేందుకు తన సహ నటుడి సహాయాన్ని తీసుకుంటాడు. ఈ హై ఓల్టేజ్ కామెడీ అడ్వెంచర్‌ విజయవంతమైన అమెరికన్ టీవీ సిరీస్ లో రెండవ సీక్వెల్.

6. ఎరిక్ (మే 30) -నెట్ ఫ్లిక్స్

1980లలో న్యూయార్క్ లో ప్రసిద్ధి చెందిన తోలుబొమ్మలాట వాడు తన చిన్న కుమారుడు పాఠశాలకి వెళ్ళే మార్గంలో అదృశ్యమయ్యాడని తెలుసుకుని అన్వేషణ ప్రారంభిస్తాడు.



7. గీక్ గర్ల్ (మే 30) -నెట్ ఫ్లిక్స్

లండన్ ఫ్యాషన్ వీక్ పర్యటనలో ఒక మోడలింగ్ ఏజెంట్ ఆమెకి దగ్గరైనప్పుడు ఆమె ప్రపంచం తలకిందులవుతుంది. ఈ కామెడీ డ్రామా పూర్తి స్థాయి హాస్య ప్రహసనం.

8. ది ఫస్ట్ ఆమెన్ (మే 30) -డిస్నీ+ హాట్‌స్టార్‌

క్లాసిక్ హార్రర్ ఫ్రాంచైజ్ ‘ది ఆమెన్‌’ కి ప్రీక్వెల్. అంటే ముందు జరిగిన కథ. ఓ చర్చిలో సేవికగా జీవితాన్ని ప్రారంభించడానికి రోమ్‌కి వెళ్ళిన యువ అమెరికన్ మార్గరెట్ చుట్టూ ఈ హార్రర్ కథ వుంటుంది. అక్కడ ఆమె ఒక దుష్టావతారాన్ని ప్రపంచంలో తీసుకురావడానికి పన్నిన కుట్రతో తలపడుతుంది.

9. ఏ పార్ట్ ఆఫ్ యూ (మే 31) -నెట్ ఫ్లిక్స్

17 సంవత్సరాల వయస్సులో తన భావోద్వేగాల తీవ్రతతో గుండె పేలిపోతొందని ఆందోళన చెందిన ఓ టీనేజర్ ఎదుర్కొనే పదునైన డ్రామా.

10. జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (మే 31) -డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రాన్ హోవార్డ్ రూపొందించిన ఆకర్షణీయమైన డాక్యుమెంటరీ ఇది. ఐడియా మ్యాన్ జిమ్ హెన్సన్ జీవితాన్ని, వారసత్వాన్నీ ఇది పరిశీలిస్తుంది.

11. రైజింగ్ వాయిస్ (మే 31) -నెట్ ఫ్లిక్స్

ఈ స్పానిష్ డ్రామా 17 ఏళ్ళ అల్మా, ఆమె ప్రాణ స్నేహితులు గ్రెటా, నాటాల చుట్టూ జీవితాల్ని చిత్రిస్తుంది. ముగ్గురూ పరస్పరం అసూయతో, తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే సమస్యలతో, తమ మధ్య విషపూరిత సంబంధాలతో సతమతమవుతున్నప్పుడు, ఓ అనామక సోషల్ మీడియా పోస్టు వీళ్ళు లైంగిక వేధింపులకి గురయ్యారని రావడంతో జీవితాలు నాటకీయ మలుపు తిరుగుతాయి.

12. ది లాస్ట్ రైఫిల్‌ మ్యాన్ (మే 31) -జియో సినిమా

ఇది నిజ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఒక పదునైన డ్రామా. ఉత్తర ఐరిష్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ ఆర్మీ అధికారి సంరక్షణ గృహం నుంచి తప్పించుకుని ఫ్రాన్స్ కి చేరుకునే ఒడిదుడుకుల ప్రయాణపు కథ.

మరికొన్ని స్ట్రీమింగ్స్...

13. కలర్స్ ఆఫ్ ఈవిల్ : రెడ్ (మే 29) - నెట్ ఫ్లిక్స్

14. డాన్సింగ్ ఫర్ ది ఈవిల్ 7ఎం -టిక్ టాక్ కల్ట్ (మే 29) - నెట్ ఫ్లిక్స్

15. హౌ టు రూయిన్ లైఫ్ (మే 29) నెట్ ఫ్లిక్స్

16. కామ్డేన్ -ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (మే 29) - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

17. ఉప్పు పులి కారమ్ -తమిళ వెబ్ సిరీస్ (మే 30) - డిస్నీ ప్లస్ హాట్ స్టార్

18. విజిల్ సీజన్ 2 (మే 31) -లయన్స్ గేట్ ప్లే

19. దేడ్ భిగా జమీన్ -హిందీ మూవీ (మే 31) - జియో సినిమా

20. లా అండ్ ఆర్డర్ టొరంటో -ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (మే 31) -జియో సినిమా

21. హౌజ్ ఆఫ్ లైస్ -హిందీ వెబ్ సిరీస్- (మే 31) -జీ5

22. పొంబలై ఒరుమై- మలయాళం మూవీ (మే 31) - సైనా ప్లే

23. లంబర్ జాక్ ది మాన్‌స్టర్ -జపనీస్ మూవీ (జూన్ 1) -నెట్ ఫ్లిక్స్

24. ఎలీన్- ఇంగ్లీష్ మూవీ (జూన్ 1) -జియో సినిమా

First Published:  28 May 2024 12:00 PM IST
Next Story