Ooru Peru Bhairavakona - విరూపాక్ష తరహాలో మరో సినిమా
Ooru Peru Bhairavakona - సందీప్ కిషన్ కొత్త సినిమా ఊరి పేరు భైరవకోన. ఈరోజు ఈ సినిమా టీజర్ లాంఛ్ చేశారు.
![Ooru Peru Bhairavakona - విరూపాక్ష తరహాలో మరో సినిమా Ooru Peru Bhairavakona - విరూపాక్ష తరహాలో మరో సినిమా](https://www.teluguglobal.com/h-upload/2023/05/07/759365-ooru-peru-bhairavakona.webp)
తాజాగా విరూపాక్ష సినిమా థియేటర్లలోకి వచ్చింది. సూపర్ హిట్ అయింది. సీట్ ఎడ్జ్ థ్రిల్ అందించింది. ఇప్పుడు అదే కోవలో మరో సినిమా వస్తోంది. దీని పేరు "ఊరు పేరు భైరవకోన". విరూపాక్ష సినిమా రుద్రవనం అనే ఊరిలో జరిగితే, భైరవకోన అనే ఊరిలో జరిగే కథతో ఇది వస్తోంది. ఈరోజు రిలీజైన టీజర్ లో సినిమా జానర్ ఏంటనేది చెప్పేశారు.
సందీప్ కిషన్, డైరెక్టర్ వీఐ ఆనంద్ ల ఫాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ 'ఊరు పేరు భైరవకోన'. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించగా, ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పిస్తున్నాడు. ఈరోజు మేకర్స్ టీజర్ ను లాంచ్ చేశారు.
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉన్న గరుడ పురాణంలోని నాలుగు పేజీలు కనిపించకుండా పోయాయని వివరించే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. భైరవకోన అనే ఫిక్షనల్ ప్రపంచంలోకి రావడమే తప్పితే, బయటికి పోవడం ఉండదు. హీరో సమాధానాలు వెతకడానికి అక్కడికి చేరుకుంటాడు.
కథ కొత్తగా, కథనం ఎంగేజింగ్ గా ఉంది. ఫాంటసీ సబ్జెక్ట్ లను అందించడంలో దిట్ట విఐ ఆనంద్. సో.. భైరవకోన కచ్చితంగా థ్రిల్ అందించే అవకాశం ఉంది. టీజర్ లో సందీప్ కిషన్ యాక్షన్ అవతార్ లో కనిపించాడు. రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. వర్షా బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.