సినీ ప్రముఖల ఆఫీసుల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు
BY Raju Asari23 Jan 2025 12:01 PM IST

X
Raju Asari Updated On: 23 Jan 2025 1:46 PM IST
హైదరాబాద్‌లో మూడో రోజు గురువారం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాక ఈ బృందాలు సోదాలు జరుపుతున్నాయి.
Next Story