శాసనసభ.. తెరపైకి మరో పొలిటికల్ థ్రిల్లర్
వెండితెరపైకి మరో పొలిటికల్ డ్రామా రాబోతోంది. ఇంద్రసేన హీరోగా ఐశ్వర్యరాజ్ హీరోయిన్‌గా రాబోతున్న ఈ సినిమా పేరు శాసనసభ.
వెండితెరపైకి మరో పొలిటికల్ డ్రామా రాబోతోంది. ఇంద్రసేన హీరోగా ఐశ్వర్యరాజ్ హీరోయిన్‌గా రాబోతున్న ఈ సినిమా పేరు శాసనసభ.
రాజేంద్రప్రసాద్, సోనియ అగర్వాల్, హెబ్బాపటేల్, పృథ్వీరాజ్ కీలకపాత్రల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా ఈ సినిమా వస్తోంది. వేణు మడికంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మోషన్‌పోస్టర్ ని తాజాగా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మోషన్ పోస్టర్ లాంచ్ చేశాడు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలకు కాస్త ఫిక్షన్ జోడించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నటుడు పృధ్వీరాజ్, పొలిటికల్ విలన్ గా కనిపించనున్నాడు. ఇక రాజేంద్రప్రసాద్ పొలిటికల్ సానుభూతిపరుడి పాత్రలో కనిపించనున్నారు. సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్ పొలిటికల్ గా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్, ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. సినిమా షూటింగ్ పూర్తయింది. ఇవాళ్టి నుంచి ప్రచారం ప్రారంభించారు. ఓ మంచి రోజు చూసి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు. ఈ సినిమాతో తనకు కచ్చితంగా బ్రేక్ వస్తుందని భావిస్తున్నారు హీరోయిన్లు సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్. కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి పాత్రలు పోషించలేదని వాళ్లు చెబుతున్నారు
మరోవైపు దర్శకుడు వేణు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా పొలిటికల్ సబ్జెక్ట్ తో తెరకెక్కిందని, ఇందులో హీరోలు-విలన్లు అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ ఉండరని చెబుతున్నాడు. సందర్భానికి తగ్గట్టు హీరో పాత్రలు విలన్లుగా, విలన్ గా ఉండే పాత్రలు సానుభూతిపరులుగా మారిపోతారని చెబుతున్నాడు.