Agent Movie - ఫలించని అఖిల్ ప్రయత్నం
Akhil Agent Movie - ఏజెంట్ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్. కానీ మరోసారి ఫెయిల్ అయ్యాడు

Agent Movie Trailer: ఏజెంట్ ట్రయిలర్ లో అఖిల్ వైల్డ్ లుక్
ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు అఖిల్. కానీ అతడి ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈసారి స్టార్ డైరక్టర్ కూడా అతడ్ని కాపాడలేకపోయాడు. ఏజెంట్ సినిమా చతికిలపడింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది ఏజెంట్ మూవీ. హెవీ బజ్ కారణంగా శుక్రవారం ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అఖిల్ ఈ సినిమా ప్రచారం కోసం బాగా కష్టపడ్డాడు, 170 అడుగుల పైనుంచి రోప్ జంప్ కూడా చేశాడు. రిలీజ్ రోజు హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో పొద్దున్నే ప్రేక్షకుల మధ్య సినిమా చూశాడు.
అందుకే శుక్రవారం వసూళ్లు బాగున్నాయి. కానీ అప్పటికే నెగెటివ్ టాక్ వచ్చేసింది. సెకెండ్ షోకు హాళ్లు ఖాళీ అయ్యాయి. ఆ తర్వాత శనివారం ఉన్నంతలో ఆక్యుపెన్సీ ఓకే అనిపించుకున్నప్పటికీ, ఓపెనింగ్ డే తో పోల్చి చూస్తే తక్కువే. ఇక ఆదివారం అయిన ఈరోజు ఏజెంట్ సినిమాకు బుకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి.
ఆదివారం రోజు కూడా ఆక్యుపెన్సీ 50శాతం లేకపోతే, సోమవారం నుంచి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందోనని ట్రేడ్ అందోళన చెందుతోంది.