Telugu Global
Cinema & Entertainment

ఒకే ఒక జీవితం ట్రయిలర్ రివ్యూ

శర్వానంద్ కొత్త సినిమా రెడీ అయింది. ట్రయిలర్ రిలీజైంది. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ అయింది. ఇంతకీ ట్రయిలర్ ఎలా ఉంది.. సినిమా కాన్సెప్ట్ ఏంటి?

ఒకే ఒక జీవితం ట్రయిలర్ రివ్యూ
X

డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ, తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు శర్వానంద్. ఈ హీరో కెరీర్ లో 30వ చిత్రంగా తెరకెక్కిన వైవిధ్యమైన చిత్రం 'ఒకే ఒక జీవితం'. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంతో డిఫరెంట్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, మరీ ముఖ్యంగా తల్లీ కొడుకుల బంధంతో తెరకెక్కిన సినిమా ఇది.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఈ ద్విభాషా చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తెలుగు, తమిళం రెండు భాషలలో విడుదల చేశాడు. ట్రయిలర్ లో కథ ఏంటనే విషయాన్ని దాచిపెట్టకుండా క్లియర్ గా చెప్పేశారు.

ఈ కథ పెద్ద కలలు కనే యంగ్ మ్యుజిషియన్ కు సంబంధించినది. అతని జీవితంలో జరిగిన ఒక వ్యక్తిగత నష్టం అతన్ని కుంగదీస్తుంది. తనికి మద్దతుగా గర్ల్ ఫ్రండ్ రీతూ వర్మ ఉన్నప్పటికీ, అతను ఒంటరి. జీవితాన్ని వెలితిగా భావిస్తాడు. టైం మిషన్ ని కనుకొన్న శాస్త్రవేత్త (నాజర్) రూపంలో అతనికి జీవితంలో సెకండ్ ఛాన్స్ వస్తుంది. గతం చాలా ఉద్వేగభరితమైనది, అదే సమయంలో విషాదకరమైనది. అతను రెండో అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు అనేది ఈ సినిమా కథ.

ఓ మ్యూజీషియన్ గా, తల్లికి కొడుకుగా శర్వానంద్ బాగా సూట్ అయ్యాడు. శర్వా తల్లిగా అమల అక్కినేని కనిపించారు. రీతూ వర్మ కూల్ గా కనిపించగా, వెన్నెల కిషోర్, ప్రియదర్శి శర్వా స్నేహితులుగా నటించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

ట్రైలర్ లో సుజిత్ సారంగ్ కెమెరా పనితనం, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో సేమ్ టైమ్ రిలీజ్ అవుతోంది.



First Published:  3 Sept 2022 1:49 PM IST
Next Story