Tiger Nageswara Rao | నపుర్ సనన్ ఫస్ట్ లుక్ రిలీజ్
Tiger Nageswara Rao - రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ బయోపిక్ నుంచి హీరోయిన్ నుపురు సనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ‘టైగర్ దండయాత్ర’ పేరిట విడుదల చేసిన టీజర్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా మేకర్స్ నూపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రైలు విండో సీట్లో కూర్చున్న నూపూర్ తన లవ్ ని కలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో నూపూర్ అందంగా ఉంది. బాలీవుడ్ నటి కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.
రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న డైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.