Telugu Global
Cinema & Entertainment

దేవర సినిమాపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

దేవర మూవీ యూనిట్‌కి ఎన్టీఆర్ ప్రత్యేక ధన్యవాదలు తెలుపుతు సోషల్‌మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేశారు

దేవర సినిమాపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
X

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఎన్టీఆర్ సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు టెక్నికల్ టీమ్‌కి ధన్యవాదాలు తెలిపారు. .దేవర పార్ట్ 1కి అందుతున్నఆదరణపై తారక్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేకంగా ఉంటుంది. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ అలానే ఇతర నటీనటులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకి ప్రాణం పోసి.. మా కథకి జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివకి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించి ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది.

అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫీ, సాబు సర్ ప్రొడక్ష్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు.ఈ సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకి ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకి, వారు అందించిన ప్రేమకి ధన్యవాదాలు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకి మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు.మా నిర్మతలు సుధాకర్ మిక్కిలినేని గారు, హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్టును విజయంవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

First Published:  15 Oct 2024 4:34 PM IST
Next Story