Telugu Global
Cinema & Entertainment

Devara | దేవర పార్ట్-1 షూటింగ్ పూర్తి

Devara Part 1 - ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వస్తున్న దేవర పార్ట్-1 సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు నడుస్తున్నాయి.

Devara | దేవర పార్ట్-1 షూటింగ్ పూర్తి
X

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోంది “దేవర: పార్ట్ 1”. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. దీంతో ఇప్పుడు యూనిట్ అంతా పోస్ట్‌ ప్రొడక్షన్ పై దృష్టి సారించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.

ఎన్టీఆర్ తన షూటింగ్ పార్ట్ ను ఈ నెల మొదట్లోనే పూర్తి చేసిన సంగతి తెలిసిందే. టీమ్ మిగిలిన భాగాన్ని, "ప్యాచ్ వర్క్"ని తాజాదా పూర్తి చేసింది. "దేవర" ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. రీసెంట్ గా రిలీజైన "చుట్టమల్లె" పాట సూపర్ హిట్టవ్వడంతో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.

మణికట్టు బెణకడం వల్ల ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. ఆ టైమ్ కు ఎన్టీఆర్ అందుబాటులోకి వస్తాడు. ఈ గ్యాప్ లో మరో పాట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి ఈ సినిమాకు సంబంధించి క్షేత్రస్థాయి ప్రచార కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది. దేవర-1లో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, సెకెండ్ హీరోయిన్ గా శృతి మరాఠే నటిస్తోంది. సెప్టెంబర్ 27 సినిమా రిలీజ్.

First Published:  26 Aug 2024 4:58 AM GMT
Next Story