Telugu Global
Cinema & Entertainment

Jr NTR: ఎన్టీఆర్-కొరటాల సినిమా కోసం స్పెషల్ వీడియో

Jr NTR and Koratala Siva: తన అప్ కమింగ్ మూవీకి సంబంధించి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయబోతున్నాడు తారక్. దీనికి సంబంధించి త్వరలోనే షూట్ మొదలవుతుంది.

Jr NTR: ఎన్టీఆర్-కొరటాల సినిమా కోసం స్పెషల్ వీడియో
X

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు ఎన్టీఆర్. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఎన్టీఆర్ పై షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇది సినిమా రెగ్యులర్ షూట్ కాదు. ఓ ప్రత్యేకమైన షూటింగ్.

అవును.. ఎన్టీఆర్-కొరటాల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఎన్టీఆర్ చేత కొన్ని కీలక ప్రకటనలు చేయించబోతున్నారు. దానికి సంబంధించి తారక్ పై ప్రత్యేకంగా షూట్ నిర్వహించబోతున్నారు. ఈ నెల్లోనే ఆ షూట్ ఉండే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఇప్పటికే లొకేషన్ల వేట పూర్తిచేశాడు కొరటాల. మరోవైపు అనిరుధ్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో కొత్తగా ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్, టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

First Published:  14 Dec 2022 12:00 PM IST
Next Story