Telugu Global
Cinema & Entertainment

థియేట్రికల్ వ్యవస్థపై ఎన్టీఆర్ రియాక్షన్

మంచి సినిమా వస్తే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారంటున్నాడు ఎన్టీఆర్. ఆడియన్స్ అభిరుచి మారిందనే విషయాన్ని అంగీకరిస్తున్నాడు

థియేట్రికల్ వ్యవస్థపై ఎన్టీఆర్ రియాక్షన్
X

ఓ మోస్తరు కంటెంట్ తో వస్తున్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించడం లేదు. థియేటర్ల మొహం చూడడం లేదు. లార్జర్ దేన్ లైఫ్ కథలు, పాత్రలు ఉన్నప్పుడు, స్టార్ ఎట్రాక్షన్ కనిపించినప్పుడు మాత్రమే థియేటర్లకు వెళ్తున్నారు. అందుకే యావరేజ్ టాక్ తో వస్తున్న సినిమాలు థియేటర్లలో నిలబడడం లేదు.

ఈ మొత్తం వ్యవహారంపై ఎన్టీఆర్ స్పందించాడు. ఆడియన్స్ డిమాండ్ కు తగ్గట్టు కంటెంట్ లేకపోతే సినిమాలు చూడడం లేదనే విషయాన్ని ఎన్టీఆర్ అంగీకరించాడు. అయితే పూర్తిగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం మానేశారనే వాదనతో మాత్రం ఏకీభవించడం లేదు.

"ఆడియెన్స్ డిమాండ్‌కు తగ్గట్టుగా సినిమాలు రాకపోతే చూడటం లేదు. థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. కానీ నేను నమ్మను. మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారు. ఇండస్ట్రీకి తెలుగు ప్రేక్ష‌కులు ఓ ఊపు ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను."

మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, బింబిసార అలాంటి మంచి సినిమా అవుతుందని అంటున్నాడు తారక్. అందరికంటే ముందే బింబిసారను చూసి తను అదృష్టవంతుడ్ని అయ్యానని, థియేటర్లకు వచ్చి ప్రేక్షకులు కూడా బింబిసారను చూసి అదృష్టవంతులవ్వాలని కోరాడు.

First Published:  30 July 2022 5:35 PM IST
Next Story