Telugu Global
Cinema & Entertainment

NTR Koratala: ఎన్టీఆర్ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

NTR Koratala Movie: ఈ ఏడాది ఇప్పుడే మొదలైంది. అప్పుడే వచ్చే ఏడాదికి సినిమా విడుదల లాక్ అయింది. అదే ఎన్టీఆర్ మూవీ.

NTR Koratala: ఎన్టీఆర్ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

కొరటాల దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ ఊహాగానాలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. ఎట్టకేలకు న్యూ ఇయర్ సందర్భంగా చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకొస్తుందో చెప్పారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పారు.

ఎన్టీఆర్-కొరటాల సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వస్తుంది. ఇక ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ నెల ఇటు కొరటాలకు, అటు ఎన్టీఆర్ కు ఇద్దరికీ సెంటిమెంట్. ఏప్రిల్ లోనే భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కొరటాల. అటు ఎన్టీఆర్ కు కూడా ఏప్రిల్ నెలలో కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి.

అందుకే ఇద్దరూ కలిసి 2024 సమ్మర్ ను టార్గెట్ చేశారు. అయితే ఈ ప్రకటన వెనక మరో చిన్న క్లారిటీ కూడా ఉంది. నిజానికి ఇంత త్వరగా రిలీజ్ డేట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఎనౌన్స్ చేశారంటే.. ఈ ఏడాది, ఈ సినిమా తప్ప మరో సినిమా చేయకూడదని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. అలా ఇతర దర్శకులకు ఓ చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడన్నమాట.

యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుంది. అనిరుధ్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  1 Jan 2023 6:26 PM IST
Next Story