NTR Koratala movie - మరోసారి వాయిదా పడిన ఎన్టీఆర్ మూవీ
NTR, koratala movie launch postponed - తాజ సమాచారం ప్రకారం ఈ సినిమా ఓపెనింగ్ వాయిదా పడింది.
BY Telugu Global20 Feb 2023 10:16 PM IST

X
Telugu Global Updated On: 20 Feb 2023 10:16 PM IST
ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో #NTR30 మూవీని ఈ నెల 24న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే నందమూరి తారకరత్న అకాల మరణంతో నందమూరి కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
దీంతో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించారు. త్వరలో కొత్త ముహూర్తం ఫిక్స్ అవుతుంది. ఎన్టీఆర్ సినిమా ఇలా వాయిదా పడడం ఇదే తొలిసారి కాదు.
అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తేదీ మాత్రం మారలేదు. రెగ్యులర్ చిత్రీకరణ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎంపికైంది.
కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా ఇది. హరికృష్ణ సహ నిర్మాత. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
Next Story