Telugu Global
Cinema & Entertainment

NTR30 - ఎట్టకేలకు సెట్స్ పైకి ఎన్టీఆర్

NTR - తన కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇన్నాళ్లకు మరో సినిమా స్టార్ట్ చేశాడు.

NTR30 - ఎట్టకేలకు సెట్స్ పైకి ఎన్టీఆర్
X

ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి మరో క్రేజీ ఆప్ డేట్ వచ్చేసింది. రీసెంట్ గా ఈ సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూట్ కూడా మొదలైంది.

తొలి షెడ్యూల్ లోనే నైట్ షూట్ ప్లాన్ చేశారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో రాత్రి పూట షూట్ చేస్తున్నారు. ఈ లొకేషన్ కు తారక్ చేరుకున్నాడు. తారక్ నడిచివస్తుంటే, దర్శకుడు కొరటాల శివ రిసీవ్ చేసుకునే సన్నివేశాన్ని వీడియోగా విడుదల చేశారు. నేను వస్తున్నా అనే తారక్ డైలాగ్ ను కూడా యాడ్ చేశారు.

ఇకపై పూర్తిస్థాయిలో కొరటాల శివ సినిమాపైనే వర్క్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాదాపు 5 నెలల పాటు ఈ షూటింగ్ చేయాలని నిర్ణయించారు. దీని కోసం కొంతమంది ఫారిన్ టెక్నీషియన్స్ ను కూడా తీసుకున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ ఇండియాలోనే ఉంటుంది. కాకపోతే ఫారిన్ టెక్నీషియన్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరం అవుతాయి.

ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.



First Published:  2 April 2023 7:40 PM IST
Next Story