Nora Fatehi | హీరోయిన్ నోరా డైట్ సీక్రెట్
Nora Fatehi Diet Secret - బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ మెరిసిపోతుంది. మరి ఆమె డైట్ సీక్రెట్ ఏంటి?
నోరా ఫతేహి.. బాలీవుడ్ లో చాలా పాపులర్ ఫిగర్ ఈమె. ఈ ముద్దుగుమ్మ అందాలకు బాలీవుడ్ దాసోహమైంది. టాలీవుడ్ జనాలకు ఈమె కాస్త పరిచయం తక్కువే. అయితే త్వరలోనే ఈమె తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించబోతోంది. మట్కా అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లో తిష్టవేసింది నోరా ఫతేహి.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన ఫిజిక్ వెనక డైట్ సీక్రెట్ ను బయటపెట్టింది. తన డైటీషియన్ గా యాస్మిన్ కరాచీవాలాను పెట్టుకుంది. ఇష్టమైనవి లాగించేస్తూనే మితంగా తింటుంది. తినే ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేదా అనేది మాత్రమే నోరా చూస్తుంది. తీపి పదార్థాలకు ఈమె పూర్తిగా దూరం. అప్పుడప్పుడు పిజ్జాలు, బర్గర్లు తింటుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండ్లు, ఓట్స్, తేనె, గుడ్లు తింటుంది. మధ్యాహ్నం భోజనంలో ఉడకబెట్టిన కూరగాయలు, కాల్చిన చికెన్ తో అన్నం తింటుంది. ఇక రాత్రి డిన్నర్ లో కూడా కచ్చితంగా నాన్-వెజ్ వంటకం ఉండేలా చూసుకుంటుంది.
అయితే వీటన్నింటిలో ఆయిల్స్ తక్కువగా ఉండేలా జాగ్రత్త పడుతుంది. నాన్-వెజ్ తినకంటూ ఒక్క రోజు కూడా ఉండలేనంటున్న ఈ బ్యూటీ, మన శరీరతత్వానికి తగ్గట్టు ఆహారాన్ని ఎంచుకుంటే బోర్ కొట్టదని చెబుతోంది.