Telugu Global
Cinema & Entertainment

Robinhood | నితిన్ సినిమా కూడా వాయిదా?

Nithin's Robinhood - రాబిన్ హుడ్ పై కూడా అనుమానాలు ఎక్కువయ్యాయి. డిసెంబర్ లో ఈ సినిమా రాదంటున్నారు.

Robinhood | నితిన్ సినిమా కూడా వాయిదా?
X

డిసెంబర్ బాక్సాఫీస్ పై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 డిసెంబర్ 6కు వచ్చింది. ఇక ఊహించని విధంగా గేమ్ ఛేంజర్ క్రిస్మస్ సీజన్ కు షెడ్యూల్ అయింది. దీంతో నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా ఇప్పటికే వాయిదాపడింది.

మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, సినిమా పోస్ట్ పోన్ అనే విషయాన్ని యూనిట్ లో అందరికీ చెప్పేశారు. ఇప్పుడు రాబిన్ హుడ్ వంతు వచ్చింది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కూడా డిసెంబర్ కు షెడ్యూల్ చేశారు.

ఇంకా చెప్పాలంటే తండేల్ కంటే ముందే డిసెంబర్ రిలీజ్ అని ప్రకటించాడు రాబిన్ హుడ్. కానీ ఇప్పుడు బన్నీ, చరణ్ రాకతో.. నితిన్ సినిమా కూడా వెనక్కు తగ్గేలా ఉంది. ఈ సినిమా దాదాపు డిసెంబర్ కు రానట్టే. అలా డిసెంబర్ కు అనుకున్న 2 సినిమాలు వాయిదా పడగా.. ఊహించని విధంగా పుష్ప-2, గేమ్ ఛేంజర్ డిసెంబర్ కు వచ్చి పడ్డాయి.

నితిన్ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. నితిన్ కు ఫిబ్రవరి సెంటిమెంట్ ఉంది. భీష్మ సినిమా ఫిబ్రవరిలోనే వచ్చింది. ఆ సెంటిమెంట్ ప్రకారం, రాబిన్ హుడ్ ను ఫిబ్రవరికి విడుదల చేసే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  24 July 2024 5:02 PM GMT
Next Story