Extra Ordinari Man Teaser | ఎట్స్‌ట్రా ఆర్టినరీ మ్యాన్ టీజర్ రిలీజ్
Extra Ordinari Man Telugu Movie Teaser | నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Extra Ordinary Man Teaser | ఎట్స్‌ట్రా ఆర్టినరీ మ్యాన్ టీజర్ రిలీజ్
Extra Ordinari Man Teaser | నితిన్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎక్స్ ట్రా’. రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతోంది.
హేరిష్ జయరాజ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మూవీ పోస్టర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే.. అందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారని, సినిమా షూటింగ్‌కు వచ్చిన వారిలో తనొక ఎక్స్‌ట్రా మెంబర్‌గా ఉంటాడని అర్థమవుతోంది.
నితిన్ పాత్ర ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా ఉన్నాయి. హేరిష్ జయరాజ్ సంగీతం ఆకట్టుకుంటోంది. బాహుబలి 2 ‘దండాలయ్యా...’ పాటలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు నితిన్. ఇది హిలేరియస్ గా ఉంది. శ్రీలీలతో హీరో లవ్ ట్రాక్, తండ్రైన రావు రమేష్‌తో హీరో నితిన్‌కి ఉండే సంఘర్షణ ఇవన్నీ టీజర్‌లో ఉన్నాయి.
వక్కంతం వంశీ తనదైన స్టయిల్ లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్‌గా విడుదలైన డేంజర్ పిల్ల.. సాంగ్ పెద్ద హిట్టయింది.