Telugu Global
Cinema & Entertainment

ఈ టైమ్ లో ఈ పోటీ అవసరమా..?

నితిన్-నిఖిల్ సినిమాలు పోటీ పడబోతున్నాయి. అసలే పరిస్థితులు బాగాలేవు. ఇలాంటి టైమ్ లో పోటీ అవసరమా?

ఈ టైమ్ లో ఈ పోటీ అవసరమా..?
X

నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. ఇక నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా కార్తికేయ-2. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అదే ఆగస్ట్ 12. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అసలే థియేట్రికల్ సిస్టమ్ అయోమయంగా ఉన్న ఈ పరిస్థితుల్లో 2 మిడ్-రేంజ్ సినిమాలు, ఇద్దరు మిడ్-రేంజ్ హీరోలు ఇలా పోటీపడడం అవసరమా అనే చర్చ మొదలైంది.

అది నిజమే. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఓ మోస్తరు బజ్ ఉన్న సినిమాల్ని చూడ్డానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే మిడ్ రేంజ్ సినిమాలకు ఎంత ప్రచారం కల్పించినా బాక్సాఫీస్ వద్ద టికెట్ తెగడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు రెండు మిడ్-రేంజ్ సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రావడం అంతే ఆత్మహత్యసదృశమే అంటున్నారు నెటిజన్లు.

రీసెంట్ గా వచ్చిన థాంక్యూ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నాగచైతన్య, దిల్ రాజు బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం పనిచేయలేదు. అఁతకంటే ముందొచ్చిన వారియర్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. రామ్ మాస్ అప్పీల్ పనిచేయలేదు. క్రౌజ్ పుల్లింగ్ ఫ్యాక్టర్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, వెనక్కువెళ్లేకొద్దీ చాలా సినిమాలు తగుల్తాయి.

ఇలాంటి టైమ్ లో పోటీ లేకుండా వస్తే కనీసం గట్టెక్కే ఛాన్స్ అయినా ఉంటుంది. అలాంటిది రెండు సినిమాలు ఒకే రోజు అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అది పెద్ద రిస్క్ కింద లెక్క.

అయితే ఈ రెండు సినిమాల విడుదలకు ఇంకా టైమ్ ఉంది. ఈ 10-12 రోజుల్లో ఏదో ఒక సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అది ఏ సినిమా అనేది అందరి అనుమానం. ఇప్పటికే కార్తికేయ-2 ఒకసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

First Published:  27 July 2022 5:57 PM IST
Next Story