Telugu Global
Cinema & Entertainment

Robin Hood | పరిస్థితుల వల్ల దొంగగా మారిన నితిన్

Nithin as Robin Hood - హీరో నితిన్ దొంగగా మారాడు. అతడి కొత్త సినిమాకు రాబిన్ హుడ్ అనే పేరు పెట్టారు.

Robin Hood | పరిస్థితుల వల్ల దొంగగా మారిన నితిన్
X

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. పనిలో పనిగా గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు.

ఈ చిత్రానికి ‘రాబిన్‌హుడ్’ అనే టైటిల్ పెట్టారు. ఇండియన్స్ అందరినీ తన సోదరులు, సోదరీమణులుగా భావించి, వారి నుండి డబ్బు దొంగిలించడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పే నితిన్ పాత్రను పరిచయం చేస్తూ రివిల్ చేసిన టైటిల్ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది.

నితిన్ గెటప్, యాక్షన్స్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. నితిన్ తన బ్యాగ్‌లో డబ్బు, బంగారంతో శాంతా క్లాజ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దొంగిలించిన డబ్బును ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతాడు.

దర్శకుడు వెంకీ కుడుముల సీరియస్‌ సన్నివేశాన్ని తనదైన శైలిలో వినోదాత్మకంగా చిత్రీకరించారు. తన మొదటి రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన సబ్జెక్ట్‌లను ప్రయత్నించిన వెంకీ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. టైటిల్ టీజర్ కట్‌లో తన మార్క్ చూపించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  26 Jan 2024 9:29 PM IST
Next Story