Telugu Global
Cinema & Entertainment

Swayambhu | నిఖిల్ సినిమా ఎంత వరకు వచ్చింది?

Nikhil's Swayambhu - స్వయంభూ సినిమా చేస్తున్నాడు నిఖిల్. తాజాగా ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో మొదలైంది.

Swayambhu | నిఖిల్ సినిమా ఎంత వరకు వచ్చింది?
X

నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా 'స్వయంభూ'. ఈ సినిమా కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలోని అందమైన లోకేషన్స్ లో ప్రారంభమైంది. మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తోంది 'స్వయంభూ'. హీరో నిఖిల్ కు ఇది 20వ చిత్రం. ఈ పీరియాడిక్ సినిమాలో యోధుడిగా కనిపించబోతున్నాడు నితిన్. ఈ వారియర్ పాత్ర కోసం అతడు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు.

ఈ మూవీ లో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ ఫేమ్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్.

ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  26 Jun 2024 4:36 PM GMT
Next Story