Telugu Global
Cinema & Entertainment

శ్రీవారిని దర్శించుకున్న హీరో నిఖిల్‌ సిద్ధార్థ

కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు

శ్రీవారిని దర్శించుకున్న హీరో నిఖిల్‌ సిద్ధార్థ
X

తెలుగు హీరో నిఖిల్‌ సిద్ధార్థ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట తన మామా, చీరాల ఎమ్మెల్యే కొండయ్య, భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. దర్శనం అనంతరం వేదపండితులు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. నిఖిల్‌ నటించిన ''అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'' సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్‌ అయి పాజిటివ్‌ టాక్‌ ప్రేక్షకుల ఆందరణ పొందింది. కార్తికేయ 2 సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ గా ఎదిగిన హీరో నిఖిల్‌ తో ఫొటోలు దిగేందుకు ఆలయం వెలుపల భక్తులు పోటీ పడ్డారు.

First Published:  10 Nov 2024 10:28 AM IST
Next Story