Telugu Global
Cinema & Entertainment

Committee Kurrollu | కమిటీ కుర్రాళ్లు వచ్చేస్తున్నారు

Committee Kurrollu - నిహారిక కొణెదల నిర్మాతగా మారి తీసిన సినిమా కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అయింది.

Committee Kurrollu | కమిటీ కుర్రాళ్లు వచ్చేస్తున్నారు
X

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై తెరకెక్కిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. వినూత్న ప్రచారం కారణంగా సినిమాకు మంచి బ‌జ్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఆగ‌స్ట్‌లో వ‌చ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ ను దృష్టిలో పెట్టుకొని ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను ఆగ‌స్ట్ 9న విడుద‌లచేయబోతున్నారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణెదల నిర్మిస్తున్న తొలి సినిమా ఇది. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఎక్కువ మంది కొత్త వాళ్ల‌తోనే సినిమాను పూర్తి చేశారు. 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం అవుతున్నారు.

ఈ పాత్రల మ‌ధ్య స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ‌, ప‌ల్లెటూరిలోని రాజ‌కీయాలు, యువ‌త ప‌డే సంఘ‌ర్ష‌ణ అన్నింటినీ ఈ చిత్రంలో చూపించ‌బోతున్నారు. కేవలం నటీనటులు మాత్రమే కాదు, చాలామంది టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాతో పరిచయమౌతున్నారు. అనుదీప్ దేవ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  22 July 2024 10:40 AM GMT
Next Story