Telugu Global
Cinema & Entertainment

Niharika Konidela - అన్నయ్య పెళ్లి పై నిహారిక రియాక్షన్

Niharika - వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకుంటున్నారట. మరి దీనిపై నిహారిక ఏమంటోంది?

Niharika Konidela - అన్నయ్య పెళ్లి పై నిహారిక రియాక్షన్
X

2 రోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంపై వరుసగా పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ మీడియా, వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ఎక్స్ క్లూజివ్ గా కథనం ప్రచురించింది. అయితే దీనిపై స్పందించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. వరుణ్ తేజ్, తన కొత్త సినిమా షూటింగ్ కోసం బుడాపెస్ట్ లో ఉన్నాడు. నాగబాబు, లావణ్య త్రిపాఠి అందుబాటులోకి రాలేదు.

అయితే వరుణ్ తేజ్ సోదరి నిహారిక మాత్రం మీడియా ముందుకొచ్చింది. ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు ఆమె రావాల్సి వచ్చింది. దీంతో వరుణ్ తేజ్ పెళ్లి గురించి నిహారికను ప్రశ్నించింది మీడియా. అయితే నిహారిక ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

తను కేవలం వెబ్ సిరీస్ ప్రచారం కోసం మాత్రమే వచ్చానని, దానిపై స్పందించనని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. నిహారిక సమాధానంతో ఈ మేటర్ నిజమై ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. నిజంగా, అలాంటిదేం లేనప్పుడు నిహారిక ఖండించి ఉండేది. కానీ ఆమె సమాధానం దాటేసిందంటే, ఏదో ఉందంటూ, ఇప్పుడు ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.

నిహారిక, లావణ్య త్రిపాఠి బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. సో.. నిహారికకు తెలియకుండా ఏదీ జరగదనేది చాలామంది అభిప్రాయం. అయితే నిహారిక మాత్రం ఈ పుకార్లపై స్పందించలేదు.




First Published:  17 May 2023 6:45 PM IST
Next Story