Telugu Global
Cinema & Entertainment

Nidhi Agerwal | హరిహర వీరమల్లు నుంచి నిధి ఫస్ట్ లుక్

Nidhi Agerwal - హీరోయిన్ నిధి అగర్వాల్ తెరపైకొచ్చింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజైంది.

Nidhi Agerwal | హరిహర వీరమల్లు నుంచి నిధి ఫస్ట్ లుక్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటివరకు చేయని హిస్టారికల్ వారియర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆమె పుట్టినరోజు కానుక ఇది. పోస్టర్‌లో మహాలక్ష్మి దేవి అవతారంగా, బంగారు చీరలో, అద్భుతంగా కనిపిస్తోంది నిధి. ఆమె లుక్స్ మాయ చేస్తున్నాయి.

అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాదిలోనే రిలీజయ్యే అవకాశం ఉంది.

First Published:  17 Aug 2024 4:45 PM
Next Story