బ్రిటిష్ సింగర్ నోట 'చుట్టమల్లే 'సాంగ్
సంగీతానికి హద్దులు ఉండవు.. మీరు ఈ విషయాన్ని మరోసారి నిరూపించారన్న ఎన్టీఆర్
![బ్రిటిష్ సింగర్ నోట చుట్టమల్లే సాంగ్ బ్రిటిష్ సింగర్ నోట చుట్టమల్లే సాంగ్](https://www.teluguglobal.com/h-upload/2025/02/10/1402038-ntr.webp)
ఎన్టీఆర్ 'దేవర'లో చుట్టమల్లే పాట ఎంత వైరలైందో తెలిసిందే. ఆ సాంగ్ విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తూనే ఉన్నది. తాజాగా ఈ పాటను బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్ పాడారు. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఎన్టీఆర్ స్పందించారు.
తాజాగా బెంగళూరులో ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్ తొలి ప్రదర్శన ఇచ్చారు. ఆ ఈవెంట్‌లో దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. బ్రిటిష్ సింగర్ నోట తెలుగు పాట రావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. సంగీతానికి హద్దులు ఉండవు.. మీరు ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. మీ గొంతులో చుట్టమల్లే పాట వినడం నిజంగా ప్రత్యేకం అంటూ ఆ పాప్ సింగర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ సోలో రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దేవర' సూపర్ హిట్‌గా నిలిచింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది. ఇందులోని పాటలన్నీ భారీ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ప్రత్యేకించి 'చుట్టమల్లే 'సాంగ్ సోషల్ మీడియాను ఉర్రూతలూగించింది. కొన్ని వందల రీల్స్ ఈపాటపై షేర్ అయ్యాయి.