Telugu Global
Cinema & Entertainment

'ఛత్రపతి శివాజీ మహారాజ్‌' గా రిషబ్‌ శెట్టి

ఇంత గొప్ప ప్రాజెక్టులో నటిస్తున్నందుకు గౌరవంగా గర్వంగా ఉన్నదన్న రిషబ్‌

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ గా రిషబ్‌ శెట్టి
X

సినీ హీరో రిషబ్‌ శెట్టి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఆయన డైరెక్షన్‌ చేసిన సినిమాల్లోనూ ఆయన ఎంచుకునే పాత్రలు కొత్తగా ఉంటాయి. తాజాగా ఆయన మరో గొప్ప పాత్రతో అలరించడానికి సిద్ధమయ్యారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. దీనిపై రిషబ్‌ స్పందిస్తూ.. ఈ సినిమాలో నటించడం గర్వంగా ఉందన్నారు.

ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించిన విశేషాలతో సందీప్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్న మూవీ 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌' ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్నది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై రిషబ్‌ స్పందిస్తూ.. 'ఇంత గొప్ప ప్రాజెక్టులో నటిస్తున్నందుకు గౌరవంగా గర్వంగా ఉన్నది. ఇది సినిమా మాత్రమే కాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తిమంతమైన వ్యక్తి చరిత్ర. ఇలాంటి యోధుడి చరిత్రను సినిమాగా తీసుకురావాలనేది గొప్ప ఆలోచన. ఈ యాక్షన్‌ డ్రామా కోసం సిద్ధంగా ఉండండి. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసమే కాదు.. శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను కూడా తెలుసుకోవాలని రెడీగా ఉండండి అని పోస్ట్‌ పెట్టారు.

ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. రిషబ్‌ సినిమాల ఎంపికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే 'కాంతార' మూవీతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. అలాగే ' జై హనుమాన్‌' సినిమాలో రిషబ్‌ హనుమంతుడిగా కనిపించనున్న విషయం విదితమే. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన 'హనుమాన్‌' మూవీకి ఇది సీక్వెల్‌. దీనితోపాటు 'కాంతార' ప్రీక్వెల్‌తోనూ ఆయన బిజీగా ఉన్నారు.

First Published:  3 Dec 2024 1:52 PM IST
Next Story