Telugu Global
Cinema & Entertainment

ఏఆర్‌ రెహమాన్‌, సైరాబానుల విడాకులపై వాళ్ల పిల్లలు ఏమన్నారంటే?

29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నట్లు ప్రకటించిన రెహమాన్‌, సైరాబాను

ఏఆర్‌ రెహమాన్‌, సైరాబానుల విడాకులపై వాళ్ల పిల్లలు ఏమన్నారంటే?
X

ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ అధికారికంగా వారి 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగా విడిపోతున్నట్లు వారి న్యాయవాది ప్రకటించారు. ఈ విషయంపై వారి పిల్లలు రహీమా, ఖతీజా, అమీన్‌ స్పందిస్తూ పోస్టులు పెట్టారు. 'మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ.. గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ రహీమా పోస్టు పెట్టారు. ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందకు కృతజ్ఞతలు' అంటూ ఖతీజా, అమీన్‌లు పేర్కొన్నారు.

ఏఆర్‌ రెహమాన్‌, సైరాబాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. 29 ఏళ్ల తర్వాత వీరు విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. విడాకులపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందిస్తూ.. 'మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం' అని ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

First Published:  20 Nov 2024 10:14 AM IST
Next Story