Telugu Global
Cinema & Entertainment

నా శరీరాన్ని ఒక వస్తువుగా భావించను

ఫ్యాషన్‌ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదన్న నటి ప్రియా భవానీ శంకర్‌

నా శరీరాన్ని ఒక వస్తువుగా భావించను
X

ఫ్యాషన్‌ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదని నటి ప్రియా భవానీ శంకర్‌ అన్నారు. కళ్యాణం కమనీయం మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బీజీగా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమా 'బ్లాక్‌'ను ఉద్దేశించి మాట్లాడారు. గ్లామర్‌ రోల్స్‌ పోషించడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

నా శరీరాన్ని ఒక వస్తువుగా భావించను. ఆడియన్స్‌ను రప్పించడానికి గ్లామర్‌గా కనిపించడం తనకు నచ్చదన్నారు. కెరీర్‌ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని అనుకుంటాను. దానికి అనుగుణంగానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నెగెటివ్‌ రోల్ చేయడానికి కూడా వెనుకాడను. ఎందుకంటే అది నా వృత్తి. అలాగే హీరోయిన్‌గా ఫ్యాషన్‌ పేరుతో కొన్నింటిని ప్రమోట్‌ చేయలేనని ఆమె చెప్పారు. గ్లామర్‌ రోల్స్‌ను ఉద్దేశించి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. బ్లాక్‌ మూవీకి సంబంధించి హారర్‌ జానర్‌లో ఇది తెరకెక్కింది. జీవా హీరోగా నటించిన ఈ సినిమాను బాలసుబ్రమణి డైరెక్ట్‌ చేశారు. అక్టోబర్‌ 11న విడుదల కానున్నది.

First Published:  6 Oct 2024 7:18 PM IST
Next Story