'బెండకాయ జ్యూస్ ఎందుకు?' అంటూ మంచులక్ష్మి ప్రశ్న
జగపతి బాబు సమాధానంతో షాకైన మంచు లక్ష్మి.. ఇద్దరి సంభాషణలు చూసి నవ్వుకున్న నెటిజన్లు
తన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్ల కథానాయకుడిగా జగతి బాబు ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత హీరో తండ్రిగా.. విలన్‌గా, రకరకాల ప్రధాన పాత్రలు వేస్తూ మరింత బిజీ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అంతేకాదు జగపతిబాబు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గురించి ఆయన ఓ వీడియో చేశారు. అందులో ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గరి నుంచి వ్యాయమం చేసేదాకా ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో వివరించారు. 'కాకర కాయ జ్యూస్, బెండకాయ జ్యూస్, పెరుగు అన్నం' ఇలా తన మార్నింగ్ రొటీన్ వెల్లడించారు
ఈ వీడియో చూసిన నటి మంచు లక్ష్మీ 'బెండకాయ్ జ్యూస్ ఎందుకు?' అంటూ కామెంట్ పెట్టారు. దానికి జగపతి బాబు స్పందిస్తూ 'లచ్చిమి.. బెండకాయ రసం కొలెస్ట్రాల్‌కు చాలా మంచిది. నాకూ, నీకూ కొవ్వు ఎక్కువ కాబట్టి మనకు చాలా అవసరం' అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య సంభాషణ చూసిన పలువురు నెటిజన్లు మరికొన్ని సరదా సంభాషణలు జత చేసి నవ్వులు పంచారు. జగపతి బాబు సమాధానంతో షాకైన మంచు లక్ష్మి.. 'నాకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నో.. మెంటల్ ఇష్యూస్ తప్ప.. ఇంకా ఏమీ లేదు' అంటూ సమాధానం ఇవ్వడం విశేషం.