గేమ్ ఛేంజర్ మూవీ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదలైంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కంచిన గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదలైంది. మరో నెల రోజుల్లో సినిమా రిలీజవుతుందని తెలియజేస్తూ బైక్‌పై చరణ్ వెళ్తోన్న పోటోను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ చెర్రీకి జోడీగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
రీసెంట్‌గా నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పించగా.. టీజర్‌కు మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు