Telugu Global
Cinema & Entertainment

కల్యాణ్ రామ్ మెగాస్టార్ అయితే చిరంజీవి ఎవరు?

హీరో కల్యాణ్ రామ్ కు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చేశారు నందమూరి ఫ్యాన్స్. దీంతో మెగాభిమానులు భగ్గుమంటున్నారు.

కల్యాణ్ రామ్ మెగాస్టార్ అయితే చిరంజీవి ఎవరు?
X

బింబిసార సక్సెస్ తో కొత్త వివాదం రాజుకుంది. నందమూరి అభిమానులు కొందరు కల్యాణ్ రామ్ పేరుకు ముందు మెగాస్టార్ అనే ట్యాగ్ తగిలించడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగాస్టార్ కల్యాణ్ రామ్ అనే పిలుపు వినిపిస్తోంది. దీంతో మెగాభిమానులు భగ్గుమంటున్నారు.

బింబిసారతో కల్యాణ్ రామ్ హిట్ కొట్టాడు. ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులతో పాటు చిరంజీవి కూడా బింబిసారను, కల్యాణ్ రామ్ ను అభినందించారు. అయితే కొంతమంది నందమూరి అభిమానులు మాత్రం అత్యుత్సాహంతో కల్యాణ్ రామ్ కు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చేశారు. స్లంప్ లో ఉన్న ఇండస్ట్రీని ఆదుకున్న హీరోకు మెగాస్టార్ బిరుదు తగిలించడంలో తప్పు లేదంటూ వాదనకు దిగుతున్నారు.

దీన్ని మెగా ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ ఒక్కరే ఉంటారని, అతడి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో తలెత్తిన ఫ్యాన్ వార్ లోకి జుగుప్సాకరమైన వ్యాఖ్యానాలు, మార్ఫింగులు పుట్టుకొచ్చాయి.

నందమూరి అభిమానులు ఇలా ఉన్నఫలంగా మెగాస్టార్ ట్యాగ్ ను వాడేయడం వెనక ఓ రీజన్ ఉంది. గతంలో రామ్ చరణ్ ఓ హిట్ కొట్టినప్పుడు, మేన్ ఆఫ్ ది మాసెస్ అనే ట్యాగ్ లైన్ ను వాడారు అతడి అభిమానులు. నిజానికి ఆ ట్యాగ్ ఎన్టీఆర్ ది. దాన్ని చరణ్ కోసం వాడేయడాన్ని నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఇప్పుడిలా ఏకంగా మెగాస్టార్ బిరుదును కల్యాణ్ రామ్ కోసం వాడేస్తున్నారు. అదీ అసలు సంగతి.

First Published:  7 Aug 2022 12:32 PM IST
Next Story