Nayanthara | నయనతార సినిమాపై నెట్ ఫ్లిక్స్ వేటు
Nayanthara - నయనతార తాజా చిత్రం అన్నపూరణి. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ తన వేదిక నుంచి తొలిగించింది.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చిన “అన్నపూర్ణి” సినిమా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ నుంచి తొలిగించింది.
హిందువుల మత విశ్వాసాలకు భంగం కలిగించినందుకు నటీనటులు, మేకర్స్, స్ట్రీమింగ్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను తొలిగించింది.
అన్నపూర్ణి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వర్ధమాన చెఫ్ కథను వివరిస్తుంది. మాంసాహార వంటకాలు తయారు చేయాల్సిన అవసరం ఉన్నందున ఆమె తండ్రి ఆమెను ఆ కోర్సులో చేర్చకుండా అడ్డుకుంటాడు. అయినప్పటికీ హీరోయిన్ నయనతార చెఫ్ అవుతుంది.
సినిమాలో చికెన్ బిర్యానీ తయారు చేసేందుకు పూజారి కూతురు అయిన నయనతార, నమాజ్ చేస్తుంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అంతేకాదు ఇందులో హిందూ మనోభావాలను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ కేసు ఫైల్ అయింది. దీంతో నిర్మాణ సంస్థ జీ స్టుడియోస్ క్షమాపణలు చెప్పగా, నెట్ ఫ్లిక్స్ ఆ సినిమాను తొలిగించింది.