Telugu Global
Cinema & Entertainment

Circle Movie - నీలకంఠ సినిమా విడుదలకు సిద్ధం

Neelakantha's Circle movie - సర్కిల్ మూవీతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు నీలకంఠ. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Circle Movie - నీలకంఠ సినిమా విడుదలకు సిద్ధం
X

వైవిధ్యమైన చిత్రాల రూపకర్తగా పేరున్న దర్శకుడు నీలకంఠ కొంత విరామం తర్వాత రూపొందించిన సినిమా "సర్కిల్". ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శరత్ చంద్ర ఈ సినిమా నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ అల్లుకున్న కథతో "సర్కిల్" సినిమా తెరకెక్కింది. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో హీరో ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా హిట్టవుతుందని యూనిట్ నమ్మకంగా ఉంది.

కెరీర్ లో నీలకంఠకు లాంగ్ గ్యాప్ వచ్చేసింది. గతంలో తమన్న లీడ్ రోల్ లో ఓ సినిమా తీసినప్పటికీ, వివాదాల కారణంగా అది ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇన్నాళ్లకు సర్కిల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకొస్తున్నాడు ఈ నేషనల్ అవార్డ్ గ్రహీత. ఈ సినిమా సక్సెస్ అయితే ఇతడి కెరీర్ గాడిలో పడుతుంది.

సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రశు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు

First Published:  24 Jun 2023 1:03 PM IST
Next Story