Nayanthara: ఆ లాజిక్ మిస్ అయిన నయనతార కలెక్షన్లు ఘోరంగా ఉన్నాయిగా..
Connect Movie Box Office Collections: సాధారణంగా ప్రసాద్ ఐమాక్స్ వంటి ప్రముఖ థియేటర్లలో ఈవినింగ్ మరియు నైట్ షోస్ కి ఎక్కువ ఆకూపెన్సీ ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువమంది ఉంటారు. అయినప్పటికీ కనీసం 30 నుంచి 50% ఆకూపెన్సీ ఈజీగా లభిస్తుంది. సెకండ్ షోకి కూడా దాదాపు 30% ఉంటుంది. కానీ తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించిన "కనెక్ట్" సినిమా విషయంలో మాత్రం అలా జరగటం లేదు.

ఆ లాజిక్ మిస్ అయిన నయనతార కలెక్షన్లు ఘోరంగా ఉన్నాయిగా..
సాధారణంగా ప్రసాద్ ఐమాక్స్ వంటి ప్రముఖ థియేటర్లలో ఈవినింగ్ మరియు నైట్ షోస్ కి ఎక్కువ ఆకూపెన్సీ ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువమంది ఉంటారు. అయినప్పటికీ కనీసం 30 నుంచి 50% ఆకూపెన్సీ ఈజీగా లభిస్తుంది. సెకండ్ షోకి కూడా దాదాపు 30% ఉంటుంది. కానీ తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించిన "కనెక్ట్" సినిమా విషయంలో మాత్రం అలా జరగటం లేదు.
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార నటించిన సినిమాని తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసింది ఈ భామ. ఎప్పుడూ ప్రమోషన్లకి దూరంగా ఉండే నయనతార ఈ సినిమా విషయంలో మాత్రం చాలాసార్లు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంది. కానీ నయనతార ఎంత కష్టపడినప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రమే ఉండటం గమనార్హం.
ఇక కొన్నిసార్లు అయితే కొన్ని థియేటర్లలో కేవలం 10 మంది కూడా లేకపోవడంతో షో నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చూస్తే ఎన్ని ఇంటర్వ్యూలలో కనిపించినప్పటికీ నయనతార కష్టానికి ఫలితం దక్కలేదని చెప్పుకోవాలి. నిజానికి ఇంతకుముందు వరకు నయనతార ఒక్క సినిమా ప్రమోషన్ కి కూడా కనిపించేది కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ నయనతార మీడియాకి దూరంగానే ఉండేది. ఇప్పుడు సడన్ గా కనిపించడంతో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు సినిమాలకి ప్రమోషన్లు కూడా అంతగా అవసరం లేదు.
ఉదాహరణకు "మసూద" సినిమా ఏ మాత్రం హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మూడు కోట్ల షేర్ ను అందుకుంది. నయనతార కూడా ఈ లాజిక్ ని తెలుసుకుంటే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.