మళ్ళీ వస్తున్న నేషనల్ సినిమా డే!
నేషనల్ సినిమా డే (జాతీయ సినిమా దినోత్సవం) మరో సారి జరుపుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం మరో భారీ ధర తగ్గింపుతో తిరిగి వస్తోంది. అక్టోబర్ 13, శుక్రవారం దేశవ్యాప్తంగా 4 వేల స్క్రీన్స్ పై సినిమాల ప్రదర్శన వుంటుంది. 2023 లో ఇప్పటి వరకు సాధించిన అనేక బాక్సాఫీసు విజయాల్ని పురస్కరించుకుని కృతజ్ఞతగా ప్రేక్షకులకి ఈ కానుక అందించడానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) నిర్ణయించింది.
నేషనల్ సినిమా డే (జాతీయ సినిమా దినోత్సవం) మరో సారి జరుపుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం మరో భారీ ధర తగ్గింపుతో తిరిగి వస్తోంది. అక్టోబర్ 13, శుక్రవారం దేశవ్యాప్తంగా 4 వేల స్క్రీన్స్ పై సినిమాల ప్రదర్శన వుంటుంది. 2023 లో ఇప్పటి వరకు సాధించిన అనేక బాక్సాఫీసు విజయాల్ని పురస్కరించుకుని కృతజ్ఞతగా ప్రేక్షకులకి ఈ కానుక అందించడానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) నిర్ణయించింది. ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి పివిఆర్ -ఐనాక్స్, సినీపోలిస్, మూవీటైమ్, సిటీప్రైడ్, మీరాజ్, ముక్తా ఏ 2, ఆసియన్, ఎం2కె, డిలైట్, వేవ్ మల్టీప్లెక్సులు పాల్గొంటాయి.
ఈ ఈవెంట్ లో టికెట్ల ధర కేవలం రూ. 99 లే వుంటుంది. ప్రస్తుతానికి అధికారిక వెబ్సైట్ లు అప్డేట్ కాలేదు. అయినప్పటికీ ఎంఏఐ ఆహార పానీయాలపై కొన్ని అదనపు ఆఫర్స్ ని వాగ్దానం చేసింది. ఈ సంవత్సరం అనేక చలన చిత్రాలు అన్ని వయసుల ప్రేక్షకులనూ ఒకచోట చేర్చి అద్భుత విజయాల్ని సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని, కృతజ్ఞతా భావంతో ప్రేక్షకులకి అందిస్తున్న కానుక ఈ జాతీయ సినిమా దొనోత్సవమని ఎంఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
జాతీయ సినిమా దినోత్సవం కేవలం మన దేశంలోనే జరిగే పండుగ కాదు. ఇది ప్రపంచ వ్యాప్త ఉత్సవం. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. అయితే టిక్కెట్ ధరల తగ్గింపు అంతర్జాతీయ ఈవెంట్‌లా కాకుండా, మన దేశంలో ఐమాక్స్, 4 డీఎక్స్, లేదా రిక్లయినర్ సీట్ల వంటి ప్రీమియం ఫార్మాట్‌లపై చెల్లుబాటు కాదు. గత సంవత్సరం రూ. 75 వున్న టికెట్ ధర ఈ సంవత్సరం రూ. 99 కి పెంచారు. గత సంవత్సరం 6.5 మిలియన్ల మంది ప్రేక్షకులు ఉదయం 6 గంటలకే స్క్రీనింగ్ ప్రారంభించిన షోల కోసం థియేటర్‌లకి తరలివచ్చారు. ట్రేడ్ నిపుణులు ఆ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు దాదాపు రూ. 48 కోట్లుగా అంచనా వేశారు. టికెట్ల ధర ట్యాగ్‌లో అదనపు ఇంటర్నెట్ రుసుములు, జిఎస్టీ కలిపి వున్నాయా అనేది ఇంకా ఆస్పష్టంగా వుంది. వెబ్స్ సైట్స్ అప్డేట్ చేశాక స్పష్టత వస్తుంది. నేషనల్ సినిమా డే అధికారిక వెబ్సైట్ వుంది. ఇందులో కంటెంట్ గత సంవత్సరపు కొన్ని హాలీవుడ్ సినిమాల క్లిప్పింగ్స్ తోనే ఇంకా వుంది.
ఈ సంవత్సరం ఈవెంట్ ఒక నెల ఆలస్యమైంది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ బాక్సాఫీసు కలెక్షన్స్ కి తక్కువ టిక్కెట్ ధర వల్ల ఆటంకం కలగకుండా చూసుకోవడానికి ఈవెంట్ ని వాయిదా వేశారు. గత సంవత్సరం ఇదే విధమైన ఆలస్యం జరిగింది. ‘బ్రహ్మస్త్ర’ కలెక్షన్స్ కి హాని కలగకుండా సెప్టెంబర్ 13 నుంచి 23 కి ఈవెంట్ ని వాయిదా వేశారు. ఈ సంవత్సరం అక్టోబర్ 6 న అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణిగంజ్ : ది గ్రేట్ భారత్ రెస్క్యూ’ విడుదలవుతోంది. దీనితో బాటు ‘సా ఎక్స్’, ‘ది క్రియేటర్’ అనే రెండు హాలీవుడ్ సినిమాలు విడుదలవుతాయి. ఈ మూడు సినిమాల విషయంలో టికెట్ల ధరలో మార్పు వుంటుందేమో ఇంకా స్పష్టత లేదు.
జాతీయ సినిమా దినోత్సవానికి చారిత్రక మూలాలున్నాయి. సినిమా అనేది ఎల్లప్పుడూ ప్రజలకి ఇష్టమైన వినోద సాధనంగా వుంటూ వస్తోంది. 1900ల ప్రారంభంలో అమెరికాలో మొదటి సినిమా థియేటర్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకులు సినిమాల్ని ఆరాధిస్తూనే వున్నారు. చాలా కాలం క్రితం వరకూ థియేటర్లు ప్రేక్షకుల వినోద కేంద్రాలు. సీడీలు, డీవీడీలూ వచ్చాక థియేటర్ల క్షీణ దశ ప్రారంభమయింది. ఇక కోవిడ్ 19 మహమ్మారి కాలంలోఆన్‌లైన్ స్ట్రీమింగ్ ల అభివృద్ధి థియేటర్లపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇక్కడే జాతీయ సినిమా దినోత్సవం ప్రాముఖ్యత ప్రారంభమవుతుంది.
మన దేశంలో జాతీయ సినిమా దినోత్సవం ఆనందాన్ని పునరుద్ధరించడానికి, సినిమాలని థియేటర్లలో చూడడంలోని ఆనందాన్ని ప్రేక్షకులకి గుర్తు చేయడానికి జరుపుకుంటారు. ఈవెంట్ నిర్వహణ చేపట్టిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ తరపున, దేశవ్యాప్తంగా గల సినిమా ఆపరేటర్ల సమూహం. ఇది సినిమా ప్రదర్శన రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళని పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా నియంత్రణ సంస్థలతో, పరిశ్రమ భాగస్వాములతో కలిసి పని చేస్తుంది.