Telugu Global
Cinema & Entertainment

ఎక్స్ క్లూజివ్.. పవర్ ఫుల్ పోలీస్ గా నరేష్

నాంది తర్వాత విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా పేరు ఉగ్రం. ఇప్పుడీ మూవీకి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ మేటర్ ఇది

ఎక్స్ క్లూజివ్.. పవర్ ఫుల్ పోలీస్ గా నరేష్
X

తనకు నాంది లాంటి హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు అల్లరి నరేష్. షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా హీరోయిన్ ను కూడా సెలక్ట్ చేశారు. మలయాళీ భామ మిర్నాను తీసుకున్నారు. ఇక సినిమా జానర్ ఏంటనేది కూడా చెప్పేశారు. ఇదొక థ్రిల్లర్ మూవీ అనే విషయాన్ని ఓపెనింగ్ రోజునే బయటపెట్టారు.

ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో అల్లరినరేష్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. అది కూడా పవర్ ఫుల్ పాత్రలో. సో.. అల్లరినరేష్ కూడా సీరియస్ పోలీస్ పాత్రలకు ఓకే చెప్పాడన్నమాట.

ఇప్పటివరకు చాలామంది హీరోలు పోలీస్ వేషాలు వేశారు. అన్నీ సీరియస్ పాత్రలే. ఈ క్రమంలో అల్లరినరేష్ కూడా పోలీస్ వేషం వేశాడు. కాకపోతే అప్పట్లో చేసిన పోలీస్ రోల్స్ లో కామెడీ పండించిన ఈ హీరో, ఈసారి చేయబోతున్న పోలీస్ పాత్రతో మాత్రం సీరియస్ యాక్షన్, థ్రిల్ చూపించబోతున్నాడు.

నిజానికి ఇది సీరియస్ కాప్ స్టోరీనే అయినప్పటికీ ఇందులో హీరోయిజం ఉండదట. నాంది సినిమాలో కూడా పేరుకే అల్లరి నరేష్ హీరో. సినిమాలో అతడిది కూడా ఓ పాత్ర మాత్రమే. ఈ తాజా చిత్రం ఉగ్రంలో కూడా అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో హీరోయిజం ఉండదని టాక్.

First Published:  5 Sept 2022 12:57 PM IST
Next Story