Telugu Global
Cinema & Entertainment

Nara Rohit | మళ్లీ ఫెయిలైన నారా రోహిత్

Nara Rohit - రీఎంట్రీలో అదరగొట్టాలనుకున్నాడు. కానీ నారా రోహిత్ మరోసారి ఫెయిల్ అయ్యాడు.

Nara Rohit | మళ్లీ ఫెయిలైన నారా రోహిత్
X

15 ఏళ్ల కిందటే కెరీర్ స్టార్ట్ చేశాడు నారా రోహిత్. అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. నటుడిగా అతడికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొంతమంది హీరోల్లా జోరుగా డాన్సులు వేయలేదు. అన్ని రకాల కథలు చేయలేడు. అయినప్పటికీ తన పరిథిలో మంచి స్టోరీలు ఎంచుకొని సినిమాలు చేశాడు.

కానీ 2017, 2018లో అతడి కెరీర్ పూర్తిగా గాడితప్పింది. ఎప్పుడైతే వీరభోగ వసంతరాయలు సినిమా డిజాస్టర్ అయిందో, నారా రోహిత్ కెరీర్ కు బ్రేక్ పడింది. దాదాపు ఐదేళ్ల పాటు మళ్లీ తెరపైకి రాలేకపోయాడు ఈ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతినిధి-2తో అతడు రీఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా సక్సెస్ తో కెరీర్ ను కొనసాగించాలని అతడు భావించాడు. కానీ నారా రోహిత్ ఆశలు నెరవేరలేదు. ప్రతినిధి-2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్నికల వేళ, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా క్లిక్ అవుతుందని, తన కెరీర్ ను నిలబెడుతుందని భావించాడు నారా రోహిత్. కానీ అతడి ఆశ తీరలేదు.

నిజానికి తప్పు నారా రోహిత్ దే. ఐదేళ్ల తర్వాత ఓ సినిమాతో కమ్ బ్యాక్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. సరైన ప్యాడింగ్, టెక్నీషియన్స్ ను కూడా పెట్టుకోలేదు. ఇలా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో మరోసారి ఫ్లాప్ అందుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మరో 2 సినిమాలున్నాయి. అవే అతడి కెరీర్ ను డిసైడ్ చేయబోతున్నాయి.

First Published:  15 May 2024 5:54 PM GMT
Next Story